EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO ECR Filing Deadline: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎన్నో మార్పులు తీసుకొచ్చింది.. ఇక, ఇప్పుడు యజమానులకు భారీ ఊరటనిచ్చింది EPFO… సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) ఫైలింగ్ గడువును మరో 16 రోజులు పొడిగించింది. తొలుత అక్టోబర్ 15, 2026 వరకు ఉన్న గడువును అక్టోబర్ 31 వరకు పెంచినట్లు EPFO సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. వేతన పరిమితిలో మార్పుల నేపథ్యంలో యజమానులకు అదనపు సమయం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
ECR అంటే ఏమిటి?
ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) అనేది యజమానులు ప్రతి నెలా EPFO పోర్టల్‌లో దాఖలు చేసే ఎలక్ట్రానిక్ రిటర్న్. ఇందులో ఉద్యోగుల వేతనాలు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS), ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకాలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్ల వివరాలు ఉంటాయి.
Also Read
వేతన పరిమితి పెంపుతో మారిన లెక్కలు
ప్రభుత్వం సెప్టెంబర్ 17న వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.. ఈ మార్పుతో సెప్టెంబర్ నెలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్ల లెక్కింపులో మార్పులు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు పాత రూ.15,000 పరిమితి ప్రకారం, సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు పెరిగిన రూ.25,000 పరిమితి ప్రకారం కాంట్రిబ్యూషన్లను లెక్కించాల్సి ఉంటుంది..
యజమానులకు ఎందుకు అదనపు గడువు?
వేతన పరిమితిలో మార్పుల కారణంగా సెప్టెంబర్ నెల ECR దాఖలు చేయడం యజమానులకు కొంత క్లిష్టంగా మారింది. గతంలో ఒకే వేతన పరిమితి ఆధారంగా రిటర్నులు దాఖలు చేసే విధానంలో మార్పులు రావడంతో లెక్కల సర్దుబాటుకు అదనపు సమయం అవసరమైంది. ఈ నేపథ్యంలో EPFO తొలుత అక్టోబర్ 15గా నిర్ణయించిన గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించింది.
రూ.20,000 మూల వేతనం ఉన్న ఉద్యోగికి సంబంధించి ECRను ఎలా దాఖలు చేయాలనే వివరాలను కూడా EPFO సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.. కాబట్టి యజమానులు కొత్త వేతన పరిమితికి అనుగుణంగా కాంట్రిబ్యూషన్లను లెక్కించి, గడువులోగా సెప్టెంబర్ నెల ECR ఫైలింగ్ పూర్తి చేయాలి. కాగా, వేతన పరిమితిలో మార్పుల కారణంగా.. గతంలో మొత్తం జీతం అందుకునే ఉద్యోగులకు కూడా ఇప్పుడు ఆయా సంస్థల యాజమాన్యాలు కోతలు పెట్టాయి.. మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో.. యజమానులకు కొంత సమయం దొరికింది..
తాజావార్తలు
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
ట్రెండింగ్
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!