100 Percent PF Withdrawal: దీపావళి పండుగ ముందు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమవుతోంది. న్యూఢిల్లీలో జరిగిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 238వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇప్పుడు PF ఖాతాల నుంచి 100% నిధుల ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. ఉద్యోగుల సంక్షేమాన్ని పెంపొందించే దిశగా ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మక అడుగుగా మారబోతుందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా విశ్వసం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
READ ALSO: Mamitha Baiju : ‘డ్యూడ్’ కోసం రాత్రంతా ప్రాక్టీస్ చేసి ఫోకస్ చేశా!
ఈ సమావేశంలో ఉద్యోగులు ఇప్పుడు వారి PF ఖాతాల నుంచి 100% ఉపసంహరించుకోవచ్చని నిర్ణయం తీసుకున్నారు. గతంలో పదవీ విరమణ లేదా నిరుద్యోగం తర్వాత మాత్రమే పూర్తి ఉపసంహరణ సాధ్యమయ్యేది. పలు నివేదికల ప్రకారం.. ఈ సమావేశంలో 13 సంక్లిష్టమైన పాక్షిక ఉపసంహరణ నియమాలను మూడు సరళీకృత వర్గాలుగా కలిపారు. గతంలో పోలిస్తే ఇప్పుడు విద్య కోసం 10 సార్లు, వివాహం కోసం ఐదు సార్లు పీఎఫ్ ఉపసంహరణలు అనుమతించారు. ఇంకా పాక్షిక ఉపసంహరణలకు కనీస సేవా వ్యవధి 12 నెలలకు పెంచారు. ప్రత్యేక పరిస్థితులలో సభ్యులు ఇకపై ఉపసంహరణకు కారణాన్ని అందించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. EPFO సభ్యులు తమ ఖాతా బ్యాలెన్స్‌లో కనీసం 25% “కనీస బ్యాలెన్స్”గా నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్దేశించారు. ఇది వారికి 8.25% వార్షిక వడ్డీ రేటు, కాంపౌండింగ్ ప్రయోజనాలను అందేలా చేస్తుంది.
అందుబాటులోకి ఆటో-క్లెయిమ్ సౌకర్యం..
EPFO 100% ఆటో-సెటిల్మెంట్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఇది ఉపసంహరణలను వేగవంతం చేస్తుందని, మరింత పారదర్శకంగా చేస్తుంది. అదనంగా చివరి PF ఉపసంహరణ వ్యవధిని రెండు నెలల నుంచి 12 నెలలకు పొడిగించారు. అలాగే పెన్షన్ ఉపసంహరణ వ్యవధిని 36 నెలలకు పెంచారు. ఈ నిర్ణయం ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం అందిస్తుందని, వారి పదవీ విరమణ నిధులను రక్షించడంలో సహాయపడుతుందని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. EPFO తాజా చర్యలు ఉద్యోగుల జీవితాలను సులభతరం చేయడమే కాకుండా ఆర్థిక సౌలభ్యాన్ని కూడా పెంచుతుందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉద్యోగులు వారి అవసరాలకు అనుగుణంగా ఎటువంటి సంక్లిష్టమైన విధానాలు లేకుండా, వారి నిధులను ఉపసంహరించుకోగలరు.
READ ALSO: Why Humans Cry: ఏడిస్తే కన్నీళ్లు పెట్టుకునే ఏకైక జీవులు ఏవో తెలుసా! అసలు ఏడుపు ఎందుకు వస్తుంది?
