ఎలక్ట్రిక్ కార్లు అనగానే గుర్తుకు వచ్చేపేరు ఎలన్ మస్క్. ఎలక్ట్రిక్ కార్లతో పాటుగా ఆయన స్పేస్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. స్పేస్ ఎక్స్ కంపెనీని స్థాపించి అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు. నాసాతో కలిసి రాకెట్‌లను తయారు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో స్పేస్ ఎక్స్ ద్వారా చంద్రుని మీదకు, మార్స్ మీదకు మనుషులను పంపాలనే లక్ష్యంతో మస్క్ పనిచేస్తున్నారు. ఇలాంటి మస్క్‌ను కేవలం 19 ఏళ్ల జాక్ స్వీనీ అనే కాలేజీ కుర్రోడు భయపెట్టాడు. జాక్‌కు టెక్నాలజీ అంటే పిచ్చి ప్రేమ. ఆ ప్రేమతో ట్రాకింగ్ టెక్నాలజీలో కొత్తగా ఆలోచించి ప్రముఖుల విమానాలను ట్రాక్ చేయడం మొదలుపెట్టారు.
Read: ఐదు రాష్ట్రాల ఎన్నికలు: రేపు కేంద్ర ఎన్నికల సంఘం కీలక రివ్యూ…
ఇందులో ఎలన్ మస్క్ ప్రైవేట్ విమానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అవి ల్యాండ్ అవుతున్నాయి, ఏ దిశగా ప్రయాణం చేస్తున్నాయి అనే విషయాలను ట్రాక్ చేస్తున్నాడు. ట్రాకింగ్ వివరాలను ట్విట్టర్‌లో పెట్టడంతో ఎలన్ మస్క్ షాక్ అయ్యాడు. ఇలా చేయడం వలన ఇబ్బందులు వస్తాయని, ట్రాక్ చేయకూడదని, 5 వేల డాలర్లు ఇస్తాను ట్రాకింగ్‌ను ఆపేయ్యాలని మస్క్ కోరాడట. దానికి జాక్ ఒప్పుకోలేదు. తనకు 50 వేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు మస్క్ ఒప్పుకున్నట్టు సమాచారం.
