Power Save Tips in Your Home: వేసవికాలం అంటేనే ఎండ, ఉక్కపోత ఉంటుంది. దాంతో ప్రతి రోజు లైట్లతో పాటుగా ఫ్యాన్స్, రిఫ్రిజిరేటర్స్, కూలర్, ఏసీల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎండాకాలంలో ప్రతి ఇంటిలో కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. ఇది సామాన్య ప్రజలకు భారంగానే ఉంటుంది. అయితే కరెంటు బిల్లును కాస్త అదుపుచేసే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ ప్రత్యేక లైట్ ఇంట్లో ఉంటే కరెంటు బిల్లు పెద్దగా రాదు.
కరెంటు బిల్లును నియంత్రించేందుకు పర్యావరణహితంగా ఉండేలా సోలార్ ఎల్ఈడీ లైట్స్ మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ లైట్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సోలార్ ఎల్ఈడీ లైట్లను కొన్ని గంటలు ఛార్జ్ చేస్తే.. దాదాపుగా రెండు రోజుల పాటు వెలుగుని ఇస్తుంది. అందుకే ఇంట్లో ఈ లైట్‌ను అమర్చుకుంటే.. కరెంటు బిల్లుని కాస్త తగ్గించుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఈ లైట్స్ ప్రతి ఇంట్లో కనిపిస్తున్నాయి. సోలార్ ఎల్ఈడీ లైట్స్ ఉంటే.. పవర్ పోయినపుడు కూడా మనకు ఉపయోగపడుతాయి.
Also Read:
Gold Price Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు! హైదరాబాద్‌లో తులం ఎంతంటే
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఈ సోలార్ ఎల్ఈడీ లైట్లను కొనుగోలు చేయవచ్చు. అయిదు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే మాత్రం డిస్కౌంట్లను పొందే అవకాశం ఉంది. సోలార్ ఎల్‌ఈడీ లైట్లు రెండు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. హోమ్‌హాప్ సోలార్ ఎల్‌ఈడీ, డెక్ ఎల్‌ఈడీ లైట్లు. హోమ్‌హాప్ సోలార్ ఎల్‌ఈడీ లైట్ల ధర రూ. 2996గా ఉంది. 43 శాతం తగ్గింపుతో ఈ లైట్‌ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుంచి రూ.1,699కి కొనుగోలు చేయవచ్చు. వీటిని 6-8 గంటల పాటు ఛార్జ్ చేస్తే.. 2 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. దీని వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా రాదు.
సోలార్ ఎల్‌ఈడీ డెక్ లైట్లు 74 శాతం తగ్గింపుతో ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో లభిస్తాయి. ఈ లైట్లు రూ. 1299కి లభిస్తాయి. ఈ లైట్ కూడా దాదాపుగా 2 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఈ సోలార్ లైట్లను కొనుగోలు చేసేందుకు ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ సోలార్ లైట్లు అత్యవసర పరిస్థితుల్లో నిరంతరం కాంతిని అందించగలవు. అంతేకాదు కరెంటు బిల్లుని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
Also Read: International Yoga Day: నేడే అంతర్జాతీయ యోగా దినోత్సవం..