దేశంలో పెట్రోల్ ధరలు వందకు పైగా పెరిగిపోయాయి. ధరలు పెరగడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రత్యామ్మాయ ఏర్పాట్లకోసం పరుగులు తీస్తున్నారు. ఎలక్ట్రికల్ బైకుల కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఎలక్ట్రిక్ బైకులతో పాటుగా ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నషాక్ మోటార్స్ సంస్థ విపణిలోకి రెండు రకాల సైకిల్స్‌ను విడుదల చేసింది. రూ.30 వేలకే ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి బ్యాటరీని ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. మధ్యలో ఛార్జింగ్ అయిపోతే మామూలు సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్లొచ్చు. గరుడ, జిప్పి అనే రెండు మోడల్స్‌ను విడుదల చేశారు. ఇందులో గరుడ మోడల్ ధర రూ.31,999 కాగా, జిప్పి ధర రూ.33,499గా ఉంది. కిలోమీటర్ ప్రయాణానికి 10 పైసలు ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
రూ.30 వేలకే ఎలక్ట్రిక్ సైకిల్…కిలోమీటర్‌కు ఎంత ఖర్చు అంటే…
