Site icon NTV Telugu

Dr.Reddy’s-LIC: డాక్టర్ రెడ్డీస్‌లో పెరిగిన ఎల్‌ఐసీ వాటా

Dr.reddy’s Lic

Dr.reddy’s Lic

Dr.Reddy’s-LIC: ప్రముఖ ఫార్మాస్యుటికల్‌ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వాటా పెరిగింది. గత మూడు నెలల కాలంలో ఓపెన్‌ మార్కెట్‌లో 33 పాయింట్‌ ఎనిమిది ఆరు లక్షల షేర్లను కొనుగోలు చేయటంతో ఎల్‌ఐసీ షేరు 7 పాయింట్‌ 7 శాతానికి చేరింది. గతంలో డాక్టర్‌ రెడ్డీస్‌లో ఎల్‌ఐసీ షేరు 5 పాయింట్‌ ఆరు ఐదు శాతం మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. జూన్‌ 15 నుంచి గత నెలాఖరు వరకు జరిగిన షేర్ల కొనుగోలు వివరాలను డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది.

24 ఏళ్ల గరిష్టానికి టర్కీ ఇన్‌ఫ్లేషన్‌

టర్కీ దేశంలో సెప్టెంబర్‌ నెలలో ద్రవ్యోల్బణం 24 ఏళ్ల గరిష్టానికి చేరింది. దీంతో ప్రస్తుతం ఇన్‌ఫ్లేషన్‌ 83 శాతానికి చేరినట్లు డేటా వెల్లడిస్తోంది. టర్కీలో ఈ స్థాయి ద్రవ్యోల్బణం 1998 మధ్యలో నమోదైంది. ఆ దేశ కేంద్ర బ్యాంకు ప్రయోగాత్మక చర్యలు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు దూరం కావటమే కాకుండా కరెన్సీ లిరా విలువ కూడా తగ్గింది. వార్షిక ప్రాతిపదికన పరిశీలిస్తే సెప్టెంబర్‌లో వినియోగ ధరలు ఏకంగా 83 పాయింట్‌ 5 శాతం పెరిగాయి.

read also: Union Nari Shakti Scheme: మహిళా పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్లకు పైగా రుణాలు

12 శాతం పెరిగిన బొగ్గు ఉత్పత్తి

గత నెలలో దేశవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి 12 శాతం పెరిగింది. దీంతో మొత్తం కోల్‌ ప్రొడక్షన్‌ 57 పాయింట్‌ తొమ్మిది మూడు మిలియన్‌ టన్నులకు చేరింది. గతేడాదితో పోల్చితే ఈసారి బొగ్గు ఉత్పత్తి సుమారు 6 మిలియన్‌ టన్నులు ఎక్కువ నమోదు కావటం విశేషం. కోల్‌ ఇండియా లిమిటెడ్‌తోపాటు సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ మరియు క్యాప్టివ్‌ మైన్స్‌, ఇతర గనుల్లో ఈ గ్రోత్‌ నమోదైంది. ఈ వివరాలను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టాప్‌లో ఉన్న 37 మైన్స్‌లో 25 బ్లాక్‌లు వంద శాతానికి పైగా ఔట్‌పుట్‌ సాధించాయని తెలిపింది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతానికి పైగా వాటా కోల్‌ ఇండియా లిమిటెడ్‌దే కావటం గమనార్హం.

Exit mobile version