NTV Telugu Site icon

వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీకి ఎదురుదెబ్బ

Mehul Choksi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వ‌జ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి మ‌రోసారి ఎదురుదెబ్బ త‌గ‌లింది.. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు రూ.13,500 కోట్ల రుణం ఎగ‌వేసిన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆయ‌న‌.. 2018లో భారత్‌ విడిచి పారిపోయాడు.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ తాజాగా దొరికిపోయాడు.. అయితే, బెయిల్ కోసం ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసికొట్టాయి… చోక్సీకి బెయిల్‌ ఇచ్చేందుకు డొమినికా హైకోర్టు నిరాకరించింది. డొమినికాతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, దేశం విడిచి పారిపోనని ఇచ్చిన హామీని పరిగణలోకి తీసుకోలేదు కోర్టు.. తన సోదరుడితో కలిసి ఉంటానని కోర్టుకు తెలిపారు చోక్సీ.. కానీ, అది స్థిర నివాసం కాదుక‌దా? అని కోర్టు ప్ర‌శ్నంచింది.. అత‌నిపై ఇంకా విచారణ ప్రారంభం కాలేదని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు.. మొత్తానికి ఇరుపక్షాల వాదనలు విన్నత.. కోర్టు.. బెయిల్ అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించింది. బెయిల్‌ కోసం కోర్టు ఎదుట బలమైన పూచీకత్తు ఇవ్వలేదని, విదేశాలకు పారిపోయే అవకాశం ఉండడంతో కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిందని ఆంటిగ్వా న్యూస్‌ రూమ్‌ పేర్కొంది.