దేశీయ స్టాక్ మార్కెట్‌గా భారీగా పతనం అయింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గురువారం ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. క్రమక్రమంగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 1,190 పాయింట్లు నష్టపోయి 79, 043 దగ్గర ముగియగా.. నిఫ్టీ 360 పాయింట్లు నష్టపోయి 23, 914 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.49 దగ్గర ముగిసింది.
ఇక నిఫ్టీలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్ భారీ నష్టాల్లో కొనసాగగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, సిప్లా లాభపడ్డాయి. సెక్టోరల్‌లో ఆటో, బ్యాంక్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ ఫార్మా, ఎనర్జీ 0.3-2 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం, మీడియా ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగింది.