NTV Telugu Site icon

LPG prices hiked: మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధర..

Gas Prices

Gas Prices

సామాన్యులకు బ్యాడ్‌ న్యూస్‌.. గ్యాస్‌ సిలిండర్‌ ధర మళ్లీ పెరిగింది.. ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను మరోసారి వడ్డించాయి ఆయిల్‌ కంపెనీలు, 14.2 కిలోల వంట గ్యాస్ ధర రూ.3.50 పెరగగా.. వాణిజ్య సిలిండర్‌ ధర రూ. 8 వడ్డించాయి.. ఈ పెరుగుదల తర్వాత, దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో రూ. 1000 దాటిపోయింది వంటగ్యాస్ సిలిండర్ ధర… ఇక, వాణిజ్య సిలిండర్‌ ధర సరేసరి.

Read Also: Minister RK Roja: క్విట్‌ చంద్రబాబు.. సేవ్‌ ఏపీ నినాదంతో ఎన్నికలకు..!

తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.1003గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.1055కు చేరింది. కోల్‌కతాలో కోల్‌కతాలో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1029, చెన్నైలో ఈరోజు నుంచి రూ.1018.5గా ఉంది.. ధర పెరుగుదల్లో సవరణల కారణంగా వంట గ్యాస్ ధర పెంచినట్టు ప్రకటించాయి ఆయిల్‌ కంపెనీలు. ఇక, పెరిగిన సిలిండర్‌ ధరలు ఇవాళ్టి నుంచి అమలు చేయనున్నట్టు స్పష్టం చేశాయి. ఈ నెలలో గ్యాస్‌ ధరలు పెంచడం ఇది రెండోసారి.. గత ఏడాది సిలెండర్‌ ధర రూ.809 రూపాయలు ఉండగా.. ఈ ఒక్క ఏడాదిలోనే రూ.200కు పైగా పెరిగింది.. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొండెక్కి కూర్చోగా.. ఇప్పుడు మరోసారి వంటగ్యాస్‌ ధర పెరగడంతో సామాన్యుడు గగ్గోలు పెడుతున్నాడు.