NTV Telugu Site icon

Disney+ Hotstar: పాస్‌వర్డ్ షేరింగ్‌కి హాట్‌స్టార్ గుడ్ బై.. షేర్ చేస్తే కఠిన చర్యలు..

Hotstar

Hotstar

Disney+ Hotstar: వీడియో స్ట్రీమింగ్, ఓటీటీ ఫ్లాట్‌‌ఫారాలు కొత్త నిబంధనలు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు పాస్‌వర్డ్ షేరింగ్ కు స్వస్తి పలకాలని అనుకుంటున్నాయి. తాజాగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ త్వరలోనే పాస్‌వర్డ్ షేరింగ్ ముగించాలని అనుకుంటోంది. ఎవరైనా సబ్‌స్క్రైబర్ పాస్‌వర్డ్ షేరింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ఇప్పటికే హాట్‌స్టార్ కెనడాలో తన పాలసీలను సవరించింది. పాస్‌వర్డ్ షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

Read Also: Shukrayaan-1: శుక్రుడికి గురిపెట్టిన ఇస్రో.. అత్యంత ప్రకాశవంతమైన గ్రహంపై జీవం ఉందా?

నవంబర్ 1 నుంచి పాస్‌వర్డ్ షేరింగ్ చేయకుండా కొత్త విధానాన్ని తీసుకువస్తోంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేర్ చేయకుండా నిషేధించింది. అదే దారిలో హాట్‌స్టార్ నడుస్తోంది. ఇటీవల తన కెనడియన్ సబ్‌స్క్రైబర్లకు ఒప్పందాన్ని మారుస్తూ ఈమెయిల్స్ పంపింది. నవంబర్ 1 నుంచి మెంబర్‌షిప్ కలిగిన యూజర్లు తమ అకౌంట్ షేరింగ్ పై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది.

అకౌంట్ షేర్ చేసుకునే వినియోగదారుల్ని హాట్ స్టార్ ట్రాక్ చేస్తుంది. ఒక వేళ సబ్‌స్క్రైబర్ పాస్‌వర్డ్ షేర్ చేసుకున్నాడని తెలిస్తే ఖాతాను పరిమితం చేయడం లేకపోతే పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ నిబంధనలు కెనడాలో తీసుకువచ్చింది. భారతదేశంలో కూడా హాట్‌స్టార్ ఈ పాలసీని తీసుకువస్తుందని తెలుస్తోంది. మరోవైపు పాస్‌వర్డ్ షేరింగ్ అడ్డుకోవడానికి హాట్ స్టార్ యాడ్-సపోర్టెడ్ ప్లాన్స్ ని తీసుకురాబోతోంది.