Site icon NTV Telugu

Digital Radio: డిజిటల్‌ రేడియోతో డబుల్‌ కానున్న రెవెన్యూ

Digital Radio

Digital Radio

Digital Radio: డిజిటల్‌ రేడియో టెక్నాలజీని వాడితే వచ్చే ఐదేళ్లలో బ్రాడ్‌కాస్ట్‌ సెక్టార్‌ రెవెన్యూ రెట్టింపు కానుందని ఇవాళ విడుదలైన ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ రంగం ఆదాయం రూ.12,300 కోట్లకు వృద్ధి చెందనుందని పేర్కొంది. ‘ప్రస్తుతం రేడియో స్టేషన్ల సంఖ్య 300 లోపే ఉన్నాయి. మొబైల్‌ ఎకో సిస్టమ్‌తో ఈ సంఖ్య 1100కు పైగా పెరిగే అవకాశం ఉంది. ఎఫ్‌ఎం బ్యాండ్లలో డిజిటల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కోసం ఇప్పటివరకు మన దేశం రెండు టెక్నాలజీలను పరీక్షించింది. ఒకటి.. హెచ్‌డీ రేడియో. రెండు.. డిజిటల్‌ రేడియో మొండియాల్‌. అదనపు స్పెక్ట్రం అవసరంలేకపోయినా మొబైల్‌ ఎకోసిస్టమ్‌ సపోర్ట్‌ ఉంటే ప్రసార రంగం కొత్త పుంతలు తొక్కుతుంది’ అని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌(ఐసీఈఏ), ఈవై సంయుక్తంగా రూపొందించిన రిపోర్ట్‌ వెల్లడించింది.

పడిపోయిన రూపాయి

రూపాయి మారకం విలువ మళ్లీ పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోల్చితే ప్రస్తుతం 79.47కి చేరింది. మంగళవారం ట్రేడింగ్‌ ముగిసేటప్పుడు 79.16గా ఉన్న రూపాయి విలువ రెండు రోజుల వ్యవధిలో 31 పైసలు పతనమైంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందని ఫెడరల్‌ రిజర్వ్‌ అధికారుల వెల్లడించటంతో ఆ ప్రభావం రూపాయి మీద ప్రతికూలంగా పడింది.

IndiGo Revenue Soars. But: ఇండిగో ఆదాయానికి రెక్కలు. అయినా చుక్కలే..

తగ్గిన ‘ఆటో’ సేల్స్‌

గత ఏడాది జులై నెలతో పోల్చితే ఈ జులైలో ఆటోమొబైల్‌ రిటైల్‌ సేల్స్‌ 8 శాతం తగ్గాయి. దీంతో ప్యాసింజర్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు పడిపోయాయి. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలదీ ఇదే పరిస్థితి అని ఆటోమొబైల్‌ డీలర్స్‌ సంఘం (FADA) తెలిపింది. 2021 జులైలో 15,59,106 వాహనాలు సేల్‌ అవగా 2022 జులైలో 14,36,927 మాత్రమే అమ్ముడుపోయాయి.

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

నిన్నటి మాదిరిగానే ఇవాళ కూడా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 254 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 118 పాయింట్లు పడిపోయి 58232.51 వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. పొద్దున 77.40 పాయింట్లు పెరిగిన నిఫ్టీ ఇప్పుడు 61 పాయింట్లు పతనమై 17,326.35 వద్ద కొనసాగుతోంది. మార్నింగ్‌ సెషన్‌లో ఐటీ సంస్థల షేర్లకు లాభాలు వచ్చాయి. ఎస్‌బీఐ, మారుతీ, ఎన్టీపీసీ తదితర సంస్థలు నష్టాల్లో ఉన్నాయి.

Exit mobile version