Site icon NTV Telugu

Digital Gold Vs Physical Gold: డిజిటల్ గోల్డ్ vs రియల్ గోల్డ్.. ఏది బెస్ట్ ?

Digital Gold Vs Physical Go

Digital Gold Vs Physical Go

Digital Gold Vs Physical Gold: బంగారం ధరలు రోజురోజుకు పైపైకి వెళ్తున్న క్రమంలో కొత్తగా పసిడిలో పెట్టుబడులు పెట్టే వారికి డిజిటల్ గోల్డ్, రియల్ గోల్ట్‌లలో ఏది బెస్ట్ అనే సందేహం వస్తుంది. వాస్తవానికి భారతదేశంలో బంగారాన్ని కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా, నమ్మదగిన పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి సాంప్రదాయ బంగారం కంటే డిజిటల్ బంగారం ఎక్కువ లాభదాయకంగా ఉందా? అనే ప్రశ్న వెంటాడుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే..

READ ALSO: TG Police: తీవ్ర నేరాలు చేసిన వాళ్ల పైన పౌర సమాజం ఆగ్రహం.. అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్న పోలీసులు

ఏది బెస్ట్..నిపుణులు ఏం చెబుతున్నారు..
పలువురు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రోజుల్లో సాంప్రదాయ బంగారం కంటే డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడం చాలా మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే దీంట్లో ఉండే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. దీనిని కొనడానికి లేదా నిల్వ చేయడానికి లాకర్ అవసరం లేదని, అలాగే దొంగతనం భయం కూడా ఉండదని చెబుతున్నారు. ఈ డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కేవలం మీ ఫోన్‌చాలని చెబుతున్నారు. మీరు మొబైల్ యాప్‌లు లేదా Paytm, Google Pay, PhonePe వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ డిజిటల్ గోల్డ్‌లో కేవలం రూ.100తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చని సూచిస్తున్నారు.

డిజిటల్ బంగారం అనేది 24-క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం. దీనిని కొనుగోలుదారులు ఎప్పుడైనా అమ్మవచ్చు. ఇది పూర్తిగా సురక్షితమైన ఖజానాలో నిల్వ చేస్తారని నిపుణులు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ డిజిటల్ బంగారం కొనుగోలు చేస్తే ఎలాంటి భౌతిక నిర్వహణ అవసరం ఉండదని చెబుతున్నారు. ఇంకా దీనిని అత్యవసర సమయాల్లో తక్షణమే నగదుగా మార్చవచ్చని వెల్లడించారు. ఇది చిన్న పెట్టుబడిదారులకు సులభమైన, ఆధునిక ఎంపికగా మారిందని పేర్కొన్నారు.

రియల్ బంగారం..
ఇదే సమయంలో రియల్ బంగారం ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గకుండా ఉంది. వివాహాలు, పండుగల సమయంలో ప్రజలు నిజమైన బంగారాన్ని ధరించడం, ప్రదర్శించడం ద్వారా ఆనందిస్తారు. చాలా మంది దీనిని కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా, కుటుంబ వారసత్వ సంపదగా కూడా పరిగణిస్తుంటారు. నిజమైన బంగారాన్ని రుణాల కోసం సులభంగా తాకట్టు పెట్టవచ్చు. అలాగే మార్కెట్ ధరలు పెరిగినప్పుడు, ఈ బంగారాన్ని అమ్మడం ద్వారా గణనీయమైన లాభాలు పొందవచ్చు. నిజమైన బంగారానికి స్వచ్ఛత పరీక్ష, నిల్వ, భద్రత వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, దాని విలువ డిజిటల్ బంగారాన్ని మించిపోయిందని అంటున్నారు.

ఏది మంచి పెట్టుబడి?
సౌలభ్యం, భద్రత విషయానికి వస్తే డిజిటల్ బంగారం ముందుందని నిపుణులు చెబుతున్నారు. ఇది దొంగతనం లేదా నష్టానికి గురికాదని, దీనిని ఎప్పుడైనా అమ్మవచ్చని అంటున్నారు. అదే సమయంలో రియల్ బంగారం దీర్ఘకాలిక స్థిరమైన ఆస్తిగా ఉంటుంది, ఎక్కువ సామాజిక, వారసత్వ విలువను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. మీరు సరళమైన, ఆధునిక పెట్టుబడి మార్గాన్ని చూస్తుంటే డిజిటల్ బంగారం సరైన ఎంపిక అని వెల్లడించారు. అదే సమయంలో మీరు భావోద్వేగం, కుటుంబ సంప్రదాయంగా చూసుకుంటే రియల్ బంగారం ఉత్తమ ఎంపికగా ఉంటుందని తెలియజేశారు. వాస్తవానికి డిజిటల్ బంగారం అనేది కొత్త తరం సౌలభ్యం, సాంకేతికతను సూచిస్తుంది. అయితే రియల్ బంగారం అనేది భారతీయ సంస్కృతి, భద్రతకు చిహ్నంగా మారింది. పెట్టుబడిదారులు వారి అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా సరైన ఎంపికను ఎంచుకోవడం తెలివైన పనిగా నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO: Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో పెద్ద ట్విస్ట్.. పోటీ నుంచి తప్పుకున్న జేఎంఎం!

Exit mobile version