NTV Telugu Site icon

డిజిటల్ కరెన్సీ లాంచ్ అప్పుడేనా..?

RBI

భార‌త్‌లో డిజిట‌ల్ క‌రెన్సీ లాంచ్ గురించి ఎప్ప‌టి నుంచే చ‌ర్చ సాగుతోంది.. ఆర్బీఐ డిజిట‌ల్ క‌రెన్సీ కోసం ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న విష‌యం తెలిసిందే కాగా..? అస‌లు డిజిట‌ల్ క‌రెన్సీ దేశంలో ఎప్ప‌టి నుంచి ప్రారంభం అవుతుంద‌నే చ‌ర్చ సాగుతోంది.. ఈ త‌రుణంలో.. వ‌చ్చే ఏడాదిలో డిజిట‌ల్ క‌రెన్సీ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్న‌మాట‌.. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే ఎలక్ట్రానిక్ వాలెట్ మాదిరిగానే.. ఇది పనిచేస్తుందని చెబుతున్నారు.. ఇక‌, ఆ క‌రెన్సీకి ప్రభుత్వ హామీ కూడా ఉండటం చేత సౌకర్యవంతంగా ఉంటుంద‌ని అంటున్నారు.

లోక్‌స‌భ‌లో వార్షిక బ‌డ్జెట్ 2022-23ను ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక‌మంత్రి నిర్మలా సీతారామన్.. తన ప్రసంగంలో త్వరలో కేంద్ర బ్యాంకు మద్దతుగల డిజిటల్ రూపాయిని ప్రారంభించనున్నట్లు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.. ఆర్బీఐ జారీ చేయనున్న ఈ డిజిటల్ కరెన్సీని యూనిట్లలో లెక్కించవచ్చని, ప్రతి ఫియట్ కరెన్సీకి ప్రత్యేకమైన సంఖ్య ఉన్న‌ట్టుగానే.. ఈ డిజిటల్ కరెన్సీకి ప్రత్యేక నెంబర్ ఉండనున్నట్లు చెబుతున్నారు.. అయితే, ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీకి ఇది భిన్నంగా ఉండ‌బోతోంద‌ని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.