ఈమధ్యకాలంలో యువత మోడ్రన్ బైక్ లపై ఆసక్తి కనబరుస్తున్నారు. మార్కెట్లోకి వచ్చే బైక్ లు ఎంత ఖరీదైనా వారు కొనేసి, హాయిగా తినేస్తున్నారు. తమిళనాడుకి చెందిన యువకుడు భూపతికి బైక్ కొనాలనిపించింది. అక్షరాలా రెండున్నర లక్షల రూపాయల పెట్టి బైక్ కొనేశాడు. అదేం పెద్ద న్యూస్ కాదు కానీ. ఆ బైక్ కొనేందుకు అతను ఉపయోగించిన పద్ధతి అందరికి ఆశ్చర్యాన్ని, బైక్ షోరూం సిబ్బందికి కాసింత విసుగును పుట్టించింది.
అంతా డిజిటల్ మనీ ఉపయోగిస్తున్న ఈరోజుల్లో రెండున్నర లక్షల రూపాయల నాణేలతో బైక్ కొన్నాడు భూపతి. రెండున్నర లక్షల రూపాల నాణేలను సేకరించి బైక్ షో రూంకి ట్రాలీలో తెచ్చి పోశాడా యువకుడు. ఈ సీన్ చూసి షోరూం నిర్వాహకులకు గుండె ఆగినంత పనయింది. సేలం జిల్లా అమ్మపేట గాంధీ మైదాన్ ప్రాంతానికి చెందిన భూపతి బైక్ కొన్నాడు. పదిమంది ఉద్యోగులు ఏడుగంటల పాటు కష్టపడి కాయిన్స్ లెక్కించారు. నాణేలతో బండి కొంటే తప్పేంటి? కాయిన్స్ కరెన్సీ కాదా? సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. భూపతి అభిరుచిపై కామెంట్లు పడుతున్నాయి. మొత్తం మీద బైక్ కొన్న భూపతికి మజా అనిపిస్తే… షోరూం వారికి మాత్రం వింత అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పాలి. గతంలో ఎన్నికల సందర్భంగా తమిళనాడులో ఓ అభ్యర్ధి ఇలాగే డిసాజిట్ కోసం చిల్లర ఇచ్చి అధికారులకు షాకిచ్చాడు.
