Site icon NTV Telugu

Cognizant: ఉద్యోగులపై నిఘా పెట్టిన కాగ్నిజెంట్‌.. 5 నిమిషాల మౌస్ కదిలించకపోతే..

Cognizant

Cognizant

Cognizant: ఐటీ రంగంలో ఉద్యోగులు ఏం చేస్తున్నారనేదానిపై ప్రతిరోజు నిఘా ఉంటుంది. ఒక ఉద్యోగి ఎంత సేపు వర్క్ చేస్తున్నాడు?, ఎంతసేపు ఖాళీగా ఉంటున్నాడు అనే దానిపై కంపెనీలు చూస్తుంటాయి. అయితే, ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ కూడా ఇదే తరహాలో ఎంప్లాయిస్ కార్యకలాపాలపై నజర్ పెట్టింది. దీని కోసం కొత్త మానిటరింగ్‌ వ్యవస్థను తెచ్చింది. కంపెనీ జారీ చేసే ల్యాప్‌ట్యాప్‌లు, డెస్క్‌టాప్‌ల ద్వారా ఉద్యోగుల పని తీరును ట్రాక్‌ చేయనుంది. వారు ఉపయోగించే కీబోర్డు, మౌస్‌లను ట్రాకింగ్‌ కోసం వినియోగిస్తున్నారు. ఈ స్థాయిలో ట్రాకింగ్‌ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Read Also: Ukraine – France: రష్యా వార్‌కు ఉక్రెయిన్ భారీ డీల్.. ఫ్రాన్స్ నుంచి 100 రాఫెల్ జెట్ల కొనుగోలు ప్లాన్ !

అయితే, ఉద్యోగుల ల్యాప్‌ట్యాప్‌/ డెస్క్‌టాప్‌లో ఈ ట్రాకింగ్‌ కోసం ప్రోహ్యాన్స్‌ లాంటి టూల్స్‌ను కాగ్నిజెంట్‌ సంస్థ వాడుతుంది. ఎంప్లా్య్ ఖాళీగా ఉండే టైంని ఈ టూల్‌ ద్వారా ట్రాక్‌ చేస్తారు. మౌస్‌ లేదా కీబోర్డును ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇన్‌-యాక్టివ్‌గా ఉంచితే సదరు ఉద్యోగి ఖాళీగా ఉన్నట్లు పరిగణలోకి తీసుకుంటారు. అలాగే, మౌస్‌ లేదా కీబోర్డు 15 నిమిషాల కంటే ఎక్కువసేపు కదిలించకపోతే వేరే పనిలో ఉన్నట్లు గుర్తిస్తుంది. ఈ మానిటిరింగ్‌ వ్యవస్థ ఒక్కో టీమ్‌కు ఒక్కోలా ఉంటుందని సమాచారం.

Read Also: Vijay Cinema House : కోర్ట్ మూవీ హీరోయిన్ కొత్త సినిమా స్టార్ట్

ఇక, ఈ ట్రాకింగ్‌ను ఎంప్లాయ్ పని తీరుతో ముడిపెట్టబోమని కంపెనీ వెల్లడించింది. ప్రమోషన్లు, బోనస్‌ లాంటి వాటి అంశాల్లో ఈ డేటాను ఉపయోగించమని ఆ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు చెప్పారు. అన్ని సంస్థల మాదిరిగానే ఈ టూల్స్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. విప్రో లాంటి కంపెనీలు సైతం ప్రోహ్యాన్స్‌ టూల్స్‌ను ఉపయోగిస్తున్నాయి. దీన్ని ఉపయోగించేందుకు ఉద్యోగి నుంచి పర్మిషన్ తీసుకుంటున్నామని కంపెనీ తెలియజేస్తున్నాయి. ఎంప్లాయిస్ మాత్రం తప్పనిసరి రూల్ అని చెబుతున్నారు. ఒక్కో టాస్క్‌పై ఎంత సేపు వర్క్ చేస్తున్నారు?.. ఏ అప్లికేషన్‌ను ఎంతసేపు ఉపయోగిస్తున్నారు? వంటి వివరాలను సేకరిస్తున్నారు. ఏఐ రాకతో ఉద్యోగుల్లో ఇప్పటికే అభద్రతాభావం కొనసాగుతుండగా.. ఇలాంటి ట్రాకింగ్‌ టూల్స్‌ వల్ల ఉద్యోగుల పనిపై నిఘా పెట్టడమంటే వారిని మరింత ఒత్తిడిలోకి నెట్టడమేనని వాపోతున్నారు.

Exit mobile version