XPeng Flying Car:అమెరికా దిగ్గజం టెస్లా కంపెనీని ఒక చైనా కంపెనీ బీట్ చేసింది. టెస్లా త్వరలో తమ సొంతంగా ఎగిరే కార్లను ప్రారంభించాలని యోచిస్తున్న సమయంలో.. ఈ చైనా కంపెనీ ఆ దిశగా ఇప్పటికే ముందంజలో ఉంది. ఈ వారం ఆ చైనా కంపెనీ ఎగిరే కార్ల ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కార్లను కొత్త తరం రవాణాగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ టెస్లాను బీట్ చేసిన ఆ చైనా కంపెనీ ఏంటో తెలుసా చైనీస్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ఎక్స్‌పెంగ్. ఈ కంపెనీ ఎగిరే కార్ల తయారీ విభాగం ఎక్స్‌పెంగ్ ఏరోహ్ట్ సోమవారం ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్ ఫ్యాక్టరీలో ఎగిరే కార్ల ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించింది.
READ ALSO: Srisailam Ghat Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు..
ప్రారంభమైన ఉత్పత్తి..
ఈ కంపెనీ కర్మాగారం దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ రాజధాని గ్వాంగ్‌జౌలో ఉంది. చైనా మీడియా కథనం ప్రకారం.. సుమారు 120,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కర్మాగారం ఇప్పటికే ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ అని పిలుస్తు్న్న దాని మాడ్యులర్ ఫ్లయింగ్ కారు మొదటి దశను పూర్తి చేసింది. ఈ ప్లాంట్ ఏటా 10 వేల ఫ్లయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ మాడ్యూళ్లను ఉత్పత్తి చేయడానికి ప్లాన్ చేస్తుంది. దీని ప్రారంభ సామర్థ్యం 5,000 యూనిట్లు అని సమాచారం. పలు నివేదికల ప్రకారం.. ఈ కంపెనీ ఎగిరే కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ అవుతుందని సమాచారం. ఈ కంపెనీలో ప్రతి 30 నిమిషాలకు ఒక ఎగిరే విమానం ఉత్పత్తి అవుతుందని అంచనా.
టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఎగిరే కారు ఆవిష్కరణ అత్యంత చిరస్మరణీయ ఉత్పత్తి ఆవిష్కరణ కావచ్చని అభిప్రాయపడ్డారు. రాబోయే నెలల్లో ఈ కారును ప్రవేశపెట్టవచ్చని ఆయన చెప్పారు. “ఇది సరిగ్గా పనిచేస్తుందని మనం నిర్ధారించుకోవాలి. దీనికి అద్భుతమైన సాంకేతికత ఉంది” అని మస్క్ అన్నారు. మరో అమెరికన్ కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్ కూడా ఇటీవల తన ఎగిరే కారును పరీక్షించింది. అతి త్వరలో ఈ కంపెనీ ఎరిగే కార్ల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తుందని ప్రకటించింది.
READ ALSO: Pakistan Supreme Court Blast: పాకిస్థాన్ సుప్రీంకోర్టులో భారీ పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు..
