ఈపీఎఫ్.. ఎంప్లయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దాదాపు జాబ్ చేసే వారందరికీ తెలిసే ఉంటుంది. సంస్థలు ప్రతి ఉద్యోగికి పీఎఫ్ సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. ఉద్యోగి శాలరీ నుంచి ప్రతి నెల కొంత మొత్తం పీఎఫ్ అకౌంట్ లో జమ చేస్తారు. ఉద్యోగులకు భవిష్యత్తులో మంచి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది ఈపీఎఫ్. అయితే ఈఫీఎఫ్ లో అందే ప్రయోజనాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. ఈ కారణంగా లబ్ధి పొందలేకపోతుంటారు. ఈపీఎఫ్ లో చాలా రకాల రూల్స్ ఉంటాయి. ఇవి చందాదారులకు అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తుంటాయి.
ఈపీఎఫ్ లోని ఈ రూల్ ప్రకారం మీరు ఫ్రీగా రూ. 50 వేలు అందుకోవచ్చు. ఇంతకీ ఆ రూల్ ఏంటంటే.. లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్స్. ఈ రూల్ ప్రకారం చందాదారులు వరుసగా రెండు దశాబ్ధాలపాటు తమ ఖాతాకు నిరంతరం సహకారం అందిస్తూ ఉండాలి. అప్పుడు లాయల్టీ కమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చని సీబీడీటీ సిఫార్స్ చేస్తుంది. లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ కింద రూ. 5 వేల జీతం పొందే వ్యక్తులు రూ. 30వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. రూ. 5 వేలు, రూ. 10 వేల మధ్య బేసిక్ శాలరీ డ్రా చేసే వారు కూడా రూ. 40వేలు పొందవచ్చు.
రూ. 10 వేల కంటే ఎక్కువ మూల వేతనం డ్రా చేసే వ్యక్తులు రూ. 50వేల వరకు బెనిఫిట్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈపీఎఫ్ ఓ చందాదారుడు కంపెనీ మారిన తర్వాత కూడా వారి సింగిల్ అకౌంట్ కు కంట్రిబ్యూట్ చేయడం కొనసాగించాలి. అంటే జాబ్ మారిన తర్వాత కొత్త ఖాతాను ప్రారంభించకుండా అదే ఖాతాను ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఈ ప్రయోజనాలను పొందగలుగుతారు. మరి మీరు 20 ఏళ్లుగా పీఎఫ్ ఖాతాకు సహకారం అందిస్తున్నట్లైతే లాయాల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ ద్వారా రూ. 50 వేలు అందుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈపీఎఫ్ కార్యాలయాన్ని సంప్రదించి తెలుసుకోవచ్చు.