Site icon NTV Telugu

Smart AC Buying Guide: ఫిబ్రవరిలో కొంటే భారీ ఆదా!

Ac Offers

Ac Offers

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మొదలవ్వకముందే ఏసీ కొనుగోలు చేయడం తెలివైన పని. మార్చి నెలాఖరు నుండి ఏసీలకు డిమాండ్ విపరీతంగా పెరిగి ధరలు భారీగా పెరుగుతాయి. కానీ ఫిబ్రవరి నెలలో ఏసీ కొనుగోలు చేయడం వల్ల మీరు వేల రూపాయలను ఆదా చేయడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

1. భారీ తగ్గింపులు , ఆఫర్లు
సీజన్ ప్రారంభం కాకముందే కంపెనీలు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి లేదా కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి పరిచయం చేయడానికి భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. ఫిబ్రవరిలో ఏసీల అమ్మకాలు తక్కువగా ఉండటంతో, కస్టమర్లను ఆకర్షించేందుకు డీలర్లు క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ (No-cost EMI) వంటి సదుపాయాలను కల్పిస్తారు. దీనివల్ల సీజన్‌లో ఉండే ధర కంటే సుమారు రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు తక్కువకే ఏసీని సొంతం చేసుకోవచ్చు.

T20 World Cup 2026: బహిష్కరణకు అవకాశమే లేదు.. పాకిస్థాన్ తప్పక టీ20 ప్రపంచకప్‌ ఆడాల్సిందే!

2. ఫ్రీ ఇన్‌స్టాలేషన్ , మెయింటెనెన్స్
ఎండలు పెరిగిన తర్వాత ఏసీ కొంటే ఇన్‌స్టాలేషన్ కోసం టెక్నీషియన్ల దొరకడం కష్టమవుతుంది. పైగా ఇన్‌స్టాలేషన్ చార్జీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఫిబ్రవరిలో ఏసీ కొంటే కంపెనీలు ‘ఫ్రీ ఇన్‌స్టాలేషన్’ ఆఫర్లను ఇస్తాయి. అంతేకాకుండా, టెక్నీషియన్లు ఖాళీగా ఉండటం వల్ల మీ ఏసీని చాలా జాగ్రత్తగా, సమయం తీసుకుని బిగిస్తారు.

3. లేటెస్ట్ మోడల్స్ , ఎక్కువ ఎంపికలు
వేసవి కాలంలో స్టాక్ త్వరగా అయిపోవడంతో మనకు నచ్చిన బ్రాండ్ లేదా మోడల్ దొరకకపోవచ్చు. కానీ ఫిబ్రవరిలో స్టాక్ ఫుల్ గా ఉంటుంది. కొత్త టెక్నాలజీతో వచ్చిన ఇన్వర్టర్ ఏసీలు, వైఫై కనెక్టివిటీ ఉన్న మోడల్స్ ఇలా మీకు నచ్చిన దాన్ని అన్ని ఫీచర్లు సరిచూసుకుని ఎంచుకునే వీలుంటుంది.

4. ధరల పెరుగుదల నుండి రక్షణ
సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలల్లో రా మెటీరియల్ ధరలు పెరగడం వల్ల కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. ఫిబ్రవరిలో కొనుగోలు చేయడం ద్వారా ఈ అదనపు భారం నుండి మీరు తప్పించుకోవచ్చు. ముందస్తు ప్లానింగ్‌తో ఏసీని అమర్చుకుంటే వేసవి ప్రారంభం నుండే చల్లటి హాయిని అనుభవించవచ్చు.

IND vs NZ 4th T20: ఇట్స్ మూవీ టైమ్.. వైజాగ్‌లో సినిమా చూసిన టీమిండియా క్రికెటర్లు!

Exit mobile version