Smart AC Buying Guide: ఫిబ్రవరిలో కొంటే భారీ ఆదా!
- ఫిబ్రవరిలో ఏసీ కొనుగోలు ఎందుకు స్మార్ట్ నిర్ణయం?
- ఆఫర్లు, డిస్కౌంట్లతో రూ.10,000 వరకు లాభం
- ఫ్రీ ఇన్‌స్టాలేషన్ + లేటెస్ట్ మోడల్స్ అడ్‌వాంటేజ్
- వేసవి సీజన్‌కు ముందే ధరల పెరుగుదల నుంచి సేవింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మొదలవ్వకముందే ఏసీ కొనుగోలు చేయడం తెలివైన పని. మార్చి నెలాఖరు నుండి ఏసీలకు డిమాండ్ విపరీతంగా పెరిగి ధరలు భారీగా పెరుగుతాయి. కానీ ఫిబ్రవరి నెలలో ఏసీ కొనుగోలు చేయడం వల్ల మీరు వేల రూపాయలను ఆదా చేయడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
1. భారీ తగ్గింపులు , ఆఫర్లు
సీజన్ ప్రారంభం కాకముందే కంపెనీలు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి లేదా కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి పరిచయం చేయడానికి భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. ఫిబ్రవరిలో ఏసీల అమ్మకాలు తక్కువగా ఉండటంతో, కస్టమర్లను ఆకర్షించేందుకు డీలర్లు క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ (No-cost EMI) వంటి సదుపాయాలను కల్పిస్తారు. దీనివల్ల సీజన్‌లో ఉండే ధర కంటే సుమారు రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు తక్కువకే ఏసీని సొంతం చేసుకోవచ్చు.
Also Read
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
- ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
T20 World Cup 2026: బహిష్కరణకు అవకాశమే లేదు.. పాకిస్థాన్ తప్పక టీ20 ప్రపంచకప్ ఆడాల్సిందే!
2. ఫ్రీ ఇన్‌స్టాలేషన్ , మెయింటెనెన్స్
ఎండలు పెరిగిన తర్వాత ఏసీ కొంటే ఇన్‌స్టాలేషన్ కోసం టెక్నీషియన్ల దొరకడం కష్టమవుతుంది. పైగా ఇన్‌స్టాలేషన్ చార్జీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఫిబ్రవరిలో ఏసీ కొంటే కంపెనీలు ‘ఫ్రీ ఇన్‌స్టాలేషన్’ ఆఫర్లను ఇస్తాయి. అంతేకాకుండా, టెక్నీషియన్లు ఖాళీగా ఉండటం వల్ల మీ ఏసీని చాలా జాగ్రత్తగా, సమయం తీసుకుని బిగిస్తారు.
3. లేటెస్ట్ మోడల్స్ , ఎక్కువ ఎంపికలు
వేసవి కాలంలో స్టాక్ త్వరగా అయిపోవడంతో మనకు నచ్చిన బ్రాండ్ లేదా మోడల్ దొరకకపోవచ్చు. కానీ ఫిబ్రవరిలో స్టాక్ ఫుల్ గా ఉంటుంది. కొత్త టెక్నాలజీతో వచ్చిన ఇన్వర్టర్ ఏసీలు, వైఫై కనెక్టివిటీ ఉన్న మోడల్స్ ఇలా మీకు నచ్చిన దాన్ని అన్ని ఫీచర్లు సరిచూసుకుని ఎంచుకునే వీలుంటుంది.
4. ధరల పెరుగుదల నుండి రక్షణ
సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలల్లో రా మెటీరియల్ ధరలు పెరగడం వల్ల కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. ఫిబ్రవరిలో కొనుగోలు చేయడం ద్వారా ఈ అదనపు భారం నుండి మీరు తప్పించుకోవచ్చు. ముందస్తు ప్లానింగ్‌తో ఏసీని అమర్చుకుంటే వేసవి ప్రారంభం నుండే చల్లటి హాయిని అనుభవించవచ్చు.
IND vs NZ 4th T20: ఇట్స్ మూవీ టైమ్.. వైజాగ్‌లో సినిమా చూసిన టీమిండియా క్రికెటర్లు!
తాజావార్తలు
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!