PhonePe IPO: ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ ఆర్థిక చెల్లింపులు చేయడానికి ఫోన్‌పేపై ఎంతలా ఆధారపడుతున్నారు అంటే వర్ణించడం సాధ్యం కాదు. ఇలా ప్రతి ఒక్కరి ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఫోన్‌పే తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఎంటా నిర్ణయం అని ఆలోచిస్తున్నారా.. ఫోన్ పే మెగా ఐపీఓ కోసం సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ ఐపీఓ ద్వారా ఫోన్‌పే ఎన్ని వేల కోట్లు సమీకరించడానికి చూస్తుందో తెలుసా..
READ ALSO: RK Roja: ఈ సారి డిపాజిట్లు కష్టమే.. పవన్ కల్యాణ్‌పై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు..
సెబీ వద్ద డ్రాఫ్ట్ పేపర్లు దాఖలు..
ఫోన్‌పే ఇప్పటికే మెగా ఐపీఓ కోసం చర్యలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ ఐపీఓ ద్వారా సంస్థ రూ.12వేల కోట్ల మొత్తాన్ని సమీకరించేందుకు సెబీ వద్ద డ్రాఫ్ట్ పేపర్లు దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఫోన్ పే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించాలని చూస్తున్నట్లు వినికిడి. ఈ ఐపీఓలో వాటాదారులైన వాల్మార్ట్, టైగర్ గ్లోబల్, మైక్రోసాఫ్ట్ ఈ ఆఫర్ ఫర్ సేల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. సంస్థలోని పదిశాతం వాటాను ఈ ఐపీఓలో విక్రయానికి పెట్టనున్నట్లు టాక్.
2015లో ప్రారంభమైన ఫోన్ పే..
సమీర్ నిగమ్, రాహుల్ చారి, బర్జిన్ ఇంజినీర్ ఫోన్‌పేను 2015 డిసెంబర్‌లో ప్రారంభించారు. 2016లో ఇది లైవ్‌లోకి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఫోన్‌పే ‘భారతీయ స్టాక్ మార్కెట్లలో ఫోన్‌పేను నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ అని సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఫోన్‌పే పోటీ సంస్థలు అయిన పేటీఎం, మొబిక్విక్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో నమోదయ్యాయి. పేటీఎం ఒక్కో షేరును ఐపీఓలో రూ.2,150 ధరకు జారీ చేయగా, మొబిక్విక్ షేరు రూ.279 వద్ద ఇష్యూకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఐపీఓకు రానున్న ఫోన్‌పే స్టాక్ మార్కెట్‌లో ఒక్కో షేరును ఎంత ధరకు జారీ చేయనుందో అని ఆర్థిక నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
READ ALSO: Rithu Chowdary : రీతూతో అర్ధరాత్రి డ్రగ్స్.. వీడియోలు లీక్.. అసలు నిజాలు బయటపెట్టిన హీరో
