Site icon NTV Telugu

LIC Smart Pension Plan: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.10 వేలు రిటన్స్.. ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్ చూశారా!

Lic

Lic

LIC Smart Pension Plan: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రజలందరి కోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి తీసుకొచ్చింది. పదవీ విరమణ తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉండటానికి సహాయపడే విధంగా LIC స్మార్ట్ పెన్షన్ పథకంను అందుబాటులోకి తీసుకుంది. ఇది తక్షణ యాన్యుటీ ప్లాన్, ఇందులో ఒకసారి పెట్టుబడితే, ఆ తర్వాత జీవితాంతం పెన్షన్ లాగా నెలనెలకు రూ.10 వేలకు పైగా రిటన్స్ అందుతాయి. ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: iQOO Z11 Turbo vs RedMagic 11 Air: ఏ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ బెస్ట్..?

LIC యొక్క స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు దూరంగా ఉంటుంది. ఇది సాధారణ ఆదాయం కోసం పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసే వారికి ఉత్తమమైన ఎంపికగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ LIC ప్లాన్, అంటే దీనిలో సున్నా మార్కెట్ రిస్క్ ఉంటుంది. LIC స్మార్ట్ పెన్షన్ పథకంలో కనీస యాన్యుటీ కొనుగోలు రూ.1 లక్ష ఉంటుంది. అయితే గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. ఈ పాలసీని జీవిత భాగస్వామితో కలిసి సింగిల్ లేదా జాయింట్ పాలసీదారుగా తెరవవచ్చు. పాలసీదారుడు వారి అవసరాలను బట్టి నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక పెన్షన్ ఎంపికలను ఎంచుకోవచ్చు. అదనంగా ఎంపికలలో వార్షిక పెన్షన్ పెరుగుదల 3% లేదా 6% లేదా మరణం తరువాత పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడం వంటివి ఉన్నాయి. ఈ పథకం పదవీ విరమణ తర్వాత నెలవారీ ఆదాయం కోరుకునే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లకు ఉపయోగపడుతుంది.

నెలకు రూ.10,880 ఎలా వస్తుందో చూడండి..
LIC స్మార్ట్ పెన్షన్ ప్లాన్ కింద నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ నెలవారీ ఆదాయాన్ని సాధించడం చాలా సులభం. ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసేటప్పుడు పెట్టుబడిదారులు రూ.20 లక్షల మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. LIC కాలిక్యులేటర్ ప్రకారం.. ఈ మొత్తం పెట్టుబడి సంవత్సరానికి రూ.1,36,000 రిటన్స్ ఇస్తుంది. దీనిని ఆరు నెలల వరకు చూస్తే రూ.66,640, మూడు నెలలకు చూస్తే రూ.32,980 వస్తుంది. అలాగే నెలవారీగా చూస్తే నెలకు రూ.10,880 వస్తుంది. అయితే ఈ పథకంలో మీకు హామీ ఇచ్చిన ఆదాయం మీ వయస్సు, అలాగే మీరు ఎంచుకున్న ఎంపికపై ఆధారపడి ఉంటుంది.

READ ALSO: Tejashwi Yadav: ఆర్జేడీలో లాలూ వారసుడికి కీలక బాధ్యతలు..

Exit mobile version