ఉద్యోగం చేస్తే డబ్బులు సరిపోవడం లేదని చాలా మంది బిజినెస్ లు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ముఖ్యంగా కొత్త పద్ధతులతో పంటలను పండిస్తూ అధిక లాభాలను పొందుతున్న వారు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు.. ఎటువంటి రిస్క్ లేకుండా ఉండే బిజినెస్ ని మీరు ఎంచుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా లక్షల్లో లాభాలు వస్తాయి. చందనం కి ఉన్న డిమాండ్ ఇంతా అంతా కాదు. చందనం తో లక్షల్లో ఆదాయాన్ని మనం సంపాదించుకోవచ్చు చందనంతో ఎన్నో రకాల ఉత్పత్తులని తయారు చేస్తూ ఉంటారు..
ఈ చందనంతో ఎన్నో రకాల సౌందర్య సాధనాలను తయారు చేస్తున్నారు.. ఆయుర్వేదంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.. మన దేశంలో ఎక్కువగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి ప్రదేశాలలో పండిస్తూ ఉంటారు నిజానికి సరిగ్గా చందనం మొక్కలని పెంచితే కోట్లలో ఆదాయం వస్తుంది అయితే చందనం మొక్కలని పెంచడానికి అటవీ శాఖ అనుమతి కావాల్సి ఉంటుంది. చందన ని పర్ఫ్యూమ్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు.. అలాగే సబ్బుల తయారీ లో కూడా ఉపయోగిస్తారు.. మార్కెట్ లో ఎప్పటికి డిమాండ్ తగ్గదు..
ఇకపోతే పుట్టగొడుగులకి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. పుట్టగొడుగులు ని చాలామంది తింటూ ఉంటారు వివిధ రకాల రెసిపీలని పుట్టగొడుగులు తో తయారు చేసుకుంటారు అయితే పుట్టగొడుగులని పెంచేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ డిమాండ్ ఉండే వాటిని పెంచితే బాగా ఆదాయం వస్తుంది.. మీ సొంతంగా ఉన్న స్థలంలోనే వీటిని పెంచవచ్చు.. అలాగే కలబంద తో కూడా చక్కటి లాభాలు వస్తాయి కలబంద ని కూడా చాలా మంది పెంచుతున్నారు. కలబంద ని బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు 40 వేల పెట్టుబడితో దీన్ని మొదలు పెడితే రెండున్నర లక్షలు దాకా వస్తాయి.. అంటే ఈ పంటలతో తక్కువ కాలంలోనే లక్షాదికారి అవుతారు..