Site icon NTV Telugu

Business Idea: మీ ఇంటి పైన ఖాళీ స్థలం ఉందా.. అయితే ఈ బిజినెస్ లు చెయ్యొచ్చు..

Bussiness Plan

Bussiness Plan

బిజినెస్ చెయ్యాలనే ఆలోచన అందరికి ఉంటుంది అయితే ఎటువంటి బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయో, ఎలాంటిది చేస్తే నష్టాలు వస్తాయో అవగాహన లేకుంటే మాత్రం భారీ నష్టాలను చవి చూడాలి.. ఎటువంటి రిస్క్ లేకుండా లాభాలను పొందే బిజినెస్ లు ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం….

మాములుగా ప్రతి ఇంటి టెర్రస్ పై ఖాళీ స్థలం ఉంటుంది.. అదే కొన్ని బిజినెస్ లకు మంచి చాయిస్.. ఇంటి టెర్రస్‌పై ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు చాలా సంపాదించవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే వ్యాపారాలు ఇవి. ఈ వ్యాపారాల ద్వారా నష్టపోయే అవకాశం అసలే లేదు. మీరు ఈ వ్యాపారం ద్వారా ప్రతి నెలా సంపాదిస్తూనే ఉంటారు. టెర్రేస్ ఫార్మింగ్, సోలార్ ప్యానెల్స్, మొబైల్ టవర్లు, హోర్డింగ్‌లు ఇంటి పైకప్పుపై బ్యానర్‌లు వంటి పెట్టి సులువుగా డబ్బులను సంపాదించవచ్చు.. ఆ బిజినెస్ ల గురించి ఒక లుక్ వేద్దాం పదండీ..

టెర్రేస్ వ్యవసాయం అంటే పైకప్పు మీద వ్యవసాయం. మీరు పెద్ద ఇంటిలో నివసిస్తూ, మీకు పెద్ద డాబా ఉంటే, మీ డాబాపై వ్యవసాయం చేయడం ద్వారా మీరు సులభంగా డబ్బు సంపాదించవచ్చు. ఇందుకోసం పైకప్పుపై పాలీబ్యాగుల్లో కూరగాయల మొక్కలను నాటాలి. టెర్రేస్ గార్డెనింగ్ మీకు ఉన్న ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. డ్రిప్ సిస్టమ్‌తో నీటిపారుదల చేయవచ్చు. సూర్య రష్మీ బాగా పడేలా చేసుకోవడం మంచిది..

మీ పైకప్పుపై సోలార్ ప్లాంట్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా వ్యాపారం చేయవచ్చు. ఇది మీకు విద్యుత్ బిల్లును ఆదా చేయడమే కాకుండా, మీకు పెద్ద మొత్తంలో డబ్బును కూడా అందిస్తుంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వం కూడా దీన్ని ప్రోత్సహిస్తోంది.. అయితే దీనికి కొంత పెట్టుబడి పెట్టడం అవసరం..

అదే విధంగా మీ ఇల్లు నగరంలో ప్రముఖ ప్రదేశంలో ఉండి, దూరం నుంచి సులభంగా కనిపించేలా లేదా రోడ్డు పక్కన నిర్మించబడినట్లయితే, మీరు మీ పైకప్పుపై బ్యానర్లు లేదా హోర్డింగ్‌లను అమర్చడం ద్వారా కూడా డబ్బులను సంపాదించవచ్చు..

చివరగా..టెర్రస్‌ పై ఖాళీ స్థలాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు ఇటువంటి వ్యాపారాలు ప్రారంభించి భారీ లాభాలను ఆర్జించవచ్చు.. మీకు ఈ బిజినెస్ లు నచ్చితే మీరు కూడా మొదలు పెట్టండి మంచి లాభలాను పొందవచ్చు..

Exit mobile version