Site icon NTV Telugu

Bussiness Idea : ఆర్గానిక్ పద్దతిలో డ్రాగన్ ఫ్రూట్స్ సాగు.. ఆదాయం మాములుగా ఉండదు..

Dragon Fruit Plantation

Dragon Fruit Plantation

యువత వ్యవసాయం వైపు పరుగులు పెడుతున్నారు.. రకరకాల ఫ్రూట్స్ ను ఆర్గానిక్ పద్దతిలో పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.. అందులో ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ ను ఆర్గానిక్ పద్దతిలో పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.. తాజాగా ఓ వ్యక్తి ఆర్గానిక్ పద్దతిలో డ్రాగన్ ఫ్రూట్స్ ను పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.. అతని సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం….

పంజాబ్ కు చెందిన అమన్ దీప్ సింగ్ సరావ్ ఉద్యోగం కోసం గుజరాత్ వెళ్తున్న సమయంలో అతనికి డ్రాగన్ ఫ్రూట్స్ ను పండిస్తున్నారు.. చూడటానికి ఆసక్తిగా ఉందని దాని గురించి ఆరా తీసారు.మార్కెట్‌లో చాలా డిమాండ్‌తో కూడిన విదేశీ పండు అని, ఇది ఆ రైతుకు మంచి లాభాలను సంపాదించడంలో సహాయపడిందని తెలుసుకున్నారు. తరువాత, మరింత సమాచారం కోసం పొరుగున ఉన్న నాలుగు పొలాలను సందర్శించాడు అమన్ సింగ్. పంజాబ్‌లోని తన పొలంలో పండ్ల రకాన్ని వెయ్యాలని అనుకున్నాడు.. అదే ఆలోచనను ఆచరించాడు.. తన పొలంలో ఈ పంటను పండించాడు..

హైదరాబాద్‌లో సాగు చేస్తున్న కొంత మంది రైతులను అమన్ సందర్శించాడు. అమన్‌ దీప్ ఈ రాష్ట్రాల నుండి మొక్కలను సేకరించి, సాగు కోసం మాన్సా గ్రామంలోని తన పొలంలో రెండు ఎకరాల భూమిని చదును చేసి వాటిని నాటాడు. కానీ మొదటి ప్రయత్నంలోనే అతనికి విజయం దక్కలేదు..అలా నాలుగు సార్లు ప్రయత్నాలు చేశాడు.ఎలాంటి రసాయనాలు, పురుగుల మందులు వాడకుండానే డ్రాగన్ ఫ్రూట్ పండించవచ్చని తెలుసుకున్నాడు.. ఆ తర్వాత తాను సేంద్రియ పద్ధతుల ద్వారా పండించాడు… ప్రస్తుతం 12 రకాల డ్రాగన్ ఫ్రూట్ లు పండిస్తూ ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నాడు.ఆ పంటలో వచ్చిన చిన్న మొక్కలను తీసి మళ్ళీ కొత్త ప్రాంతంలో నాటుతూ వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేశాడు.. అలా అతను బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు..

Exit mobile version