4.7 శాతానికి తగ్గనున్న జీడీపీ
మన దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వచ్చే ఏడాది 4.7 శాతానికి తగ్గనుంది. ద్రవ్యోల్బణ కట్టడికి సర్కారు ఇటీవల చర్యలు చేపట్టినా ఇన్‌పుట్ ఖర్చులు అంతకంతకూ అధికమవుతూ ఉండటంతో ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్ ఉందనే భయాలు నెలకొన్నాయి. దీంతో 5.4 శాతం జీడీపీ అంచనాను నొమురా ఇండెక్స్ 4.7 శాతానికి తగ్గించింది.
99.48 డాలర్లకు దిగొచ్చిన క్రూడాయిల్
గ్లోబల్ బెంచ్ మార్క్‌గా భావించే బ్రెంట్ క్రూడాయిల్ ధర తాజాగా 99.48 డాలర్లకు పడిపోయింది. డాలర్ బలపడటంతో ఒక బ్యారెల్ రేటు 100 లోపే పలుకుతోంది. ప్రపంచ ఆర్థిక రంగం మందగిస్తుందనే ఆందోళనలతోపాటు కరోనా ఆంక్షలతో చైనా దిగుమతులు తగ్గొచ్చనే భయాలు నెలకొన్నాయి. దీంతో క్రూడాయిల్ దిగొచ్చింది.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 250 పాయింట్లు పెరిగి 54,147కి చేరింది. నిఫ్టీ నిన్నటి మాదిరిగానే 16150 పాయింట్ల వద్ద ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఎఫ్‌ఎంసీజీ, రియల్ ఎస్టేట్ షేర్లకు ప్రాఫిట్లు వచ్చాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం లాభపడ్డాయి. నికర లాభం తగ్గినట్లు హెచ్‌సీఎల్ టెక్ ప్రకటించటంతో ఈ సంస్థ షేర్లు 2 శాతం పడిపోయాయి.