Nationwide Bank Strike: జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. నిజానికి ఇది వచ్చే వారం బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అయితే దేశవ్యాప్తంగా ఆ రోజు అన్ని బ్యాంకులు మూసివేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఒక వేళ 27వ తేదీ సమ్మె జరిగితే, 24, 25, జనవరి 26న (గణతంత్ర దినోత్సవం) సెలవు కారణంగా బ్యాంకు సేవలు వరుసగా నాలుగు రోజులు బంద్ అయినట్లు అవుతుంది.
READ ALSO: Tollywood Box Office: కొత్త సినిమాలే లేవు.. సంక్రాంతి విన్నర్స్‌కు గోల్డెన్ టైమ్..!
ఒక వేళ సమ్మె జరిగితే సేవలు ప్రభావితమవుతాయని అనేక ప్రధాన బ్యాంకులు ఇప్పటికే వినియోగదారులకు తెలియజేశాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ నెల ప్రారంభంలో సమ్మె నోటీసు జారీ చేసింది. ఈ అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, బ్యాంకులు, IBA ప్రతినిధులతో సహా చీఫ్ లేబర్ కమిషనర్‌తో సమావేశాలు జరిగాయి. కానీ ఎటువంటి పరిష్కారం రాలేదు. ఈ సమావేశం తరువాత జనవరి 27న సమ్మె చేయాలని యూనియన్లు నిర్ణయించాయి.
సమ్మె ఎందుకు చేస్తున్నారంటే..
ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు ప్రతి నెలా రెండవ, నాలుగవ శనివారాలు, అన్ని ఆదివారాలు సెలవులు ఇస్తున్నారు. నెలలోని అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 2024 మార్చిలో వేతన ఒప్పందం సమయంలో దీనికి అంగీకరించారు, కానీ ఇంకా ఇది అమలు కాలేదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు తమ పని గంటలను భర్తీ చేయడానికి ప్రతిరోజూ 40 నిమిషాలు అదనంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని యూనియన్లు చెబుతున్నాయి, అయినప్పటికీ ప్రభుత్వం వారి డిమాండ్‌ను విస్మరిస్తోందని తెలియజేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం జనవరి 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి జనవరి 27వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు సమ్మె జరగనుంది. ఈ సమయంలో డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATMలను ఉపయోగించాలని SBIతో సహా అనేక ప్రధాన బ్యాంకులు కస్టమర్లకు సూచించాయి. అవసరమైతే కస్టమర్ సర్వీస్ పాయింట్లు కూడా తెరిచి ఉంటాయని తెలిపాయి.
READ ALSO: Farmer Success Story: గూగుల్ సలహాతో కోటీశ్వరుడైన రైతు..
