NTV Telugu Site icon

BSNL: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కొత్త లోగోతో పాటు ఫీచర్లు వచ్చేశాయ్!

Bsnl

Bsnl

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. త్వరలో 5జీ సేవలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా కొత్త లోగోను అవిష్కరించింది. దీంతో పాటు మంగళవారం ( అక్టోబర్ 22) బీఎస్ఎన్‌ఎల్ ఏడు కొత్త ఫీచర్లను ప్రారంభించింది. బీఎస్ఎన్‌ఎల్ ఇప్పటికే దేశంలో ఎంపిక చేసిన సర్కిళ్లలో 4జీ సేవలను అందిస్తోంది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు అనేక కొత్త కొత్త ఫీచర్లను అందించబోతుంది. ఇందులో భాగంగా అన్ వాంటెడ్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు స్పామ్ ఫ్రీ నెట్ వర్క్‌ను తీసుకొచ్చింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పామ్-ఫ్రీ నెట్‌వర్క్, వై-ఫై రోమింగ్ మరియు డైరెక్ట్-టు-డివైస్ కనెక్టివిటీతో సహా ఏడు కొత్త BSNL సేవలను ప్రారంభించారు.

దీంతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ 500కి పైగా లైవ్ ఛానెల్స్, పేటీవీ ఆప్షన్లతో కొత్తగా ఫైబర్ టీవీ సర్వీస్‌ను ప్రకటించింది. ఇది ఫైబర్ ఇంటర్నెట్ సబ్ స్క్రైబర్లందరికీ అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. అంతేకాదు కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేసేందుకు ఆటోమేటెడ్ కియోస్క్ లను పరిచయం చేస్తుంది. అంతేకాకుండా దేశంలో మొట్టమొదటి డైరెక్ట్ టు డివైజ్ (D2D) కనెక్టివిటీ సొల్యూషన్ ను ప్రారంభించింది. ఇది శాటిలైట్, మొబైల్ నెట్ వర్క్ లను కలుపుతుంది. ఈ కొత్త సర్వీస్ అత్యవసర పరిస్థితుల్లో , మారుమూల ప్రాంతాల్లో కీలకంగా మారనుంది. సాధారణ కనెక్టివిటీ లేని ప్రదేశాల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు.

ఇది కూడా చదవండి: High Court: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు తీర్పు వాయిదా..