BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్

  • కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్
  • కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
  • సెప్టెంబర్ 12 వరకు మాత్రమే ఆఫర్
Bsnl

Bsnl

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్‌ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కేవలం ఒక రూపాయికే అపరిమిత కాలింగ్, డేటా సదుపాయాన్ని కల్పించింది.  బీఎస్‌ఎన్ఎల్ ఫ్రీడమ్ 2.0 ఆఫర్ కింద కొత్త కస్టమర్‌లకు కేవలం రూ.1కే సిమ్ కార్డ్, అపరిమిత కాలింగ్, రోజుకు 1GB డేటా, 100 SMS మెసేజ్‌లను అందిస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఎయిర్‌టెల్, జియో ప్లాన్‌ల ధరలను పెంచుతున్న తరుణంలో BSNL అందిస్తున్న ఆఫర్ వినియోగదారులకు ఉపశమనాన్ని కలిగించనుంది.

BSNL ఫ్రీడమ్ 2.0 కింద కొత్త కస్టమర్‌లు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను పొందుతారు. వారు రోజుకు 1GB డేటా, 100 SMSలను కూడా పొందుతారు. ఈ మొత్తం ఆఫర్ ధర కేవలం రూ.1 మాత్రమే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులు. అంటే కొత్త కస్టమర్‌లు తక్కువ ధరకే BSNL నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఈ ఆఫర్‌ను పొందడానికి వినియోగదారులు సమీపంలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను లేదా రిటైలర్‌ను సందర్శించవచ్చు. ఫ్రీడమ్ 2.0 ఆఫర్ కింద కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేసుకొని తమ కనెక్షన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.