NTV Telugu Site icon

BSNL: కొత్త ప్లాన్ వచ్చేసింది.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదంతా ఫ్రీ!

Bsnl

Bsnl

సామాన్యుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేటు టెలీకాం సంస్థలు ఇష్టానురీతిగా రీఛార్జ్ ధరలు పెంచేశాయి. కానీ కేంద్రం ఆధ్వర్యంలో నడిచే బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఆ ప్రయత్నం చేయలేదు. ఎలాంటి ఛార్జీలు పెంచకుండా మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదంతా ఉచితంగా సేవలు ఉపయోగించుకునేలా కొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు ఉంటుంది. ఇప్పటికే ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన తర్వాత చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది యూజర్లను ఆకట్టుకునేందుకు ఏడాదిపాటు ప్రయోజనాలు అందించే చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Minister Rama Naidu: అంబటి రాంబాబుకు మంత్రి నిమ్మల స్ట్రాంగ్ కౌంటర్

కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 1,198. ఈ రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటు 365 రోజులు. దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కు అయినా కాల్ చేయడానికి వినియోగదారులకు ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు లభిస్తాయి. అలాగే ప్రతి నెలా 3జీబీ హై స్పీడ్ 3G/4G డేటాను పొందుతారు. అంతేకాకుండా ప్రతి నెలా 30 ఉచిత ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే రూ.1999తో అందించే బీఎస్‌ఎన్‌ఎల్ ఒక సంవత్సరం ప్లాన్ ధరను కూడా తగ్గించింది. ఇంతకు ముందు రూ. 1999 ఉండగా ఇప్పుడు రూ. 100 తగ్గించి. రూ. 1899కే ఏడాది ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది.

ఇది కూడా చదవండి: MBA in USA: అమెరికాలో ఎంబీఏ చేయాలనుకుంటున్నారా? చౌకైన వర్సిటీలు, ఫీజులు..

Show comments