BGMI: నిషేధిత పబ్‌జీ గేమ్ తర్వాత అంతగా క్రేజ్ తెచ్చుకున్న గేమ్ ఏదైనా ఉందంటే అది BGMI. మల్టీ ప్లేయర్ గేమ్ అయిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(BGMI) భారత్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే గతంలో కాకుండా ఈ గేమ్ ఆడేందుకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లు ఉన్న యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ గేమ్ ను గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాదాపుగా ఏడాది తర్వాత ఈ గేమ్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ గేమ్ ఆడేందుకు టైమ్ లిమిట్ పెట్టింది.
Read Also: Congress: బెంగాల్‌లో కాంగ్రెస్ ఖాళీ.. ఉన్న ఒక్కడు కూడా టీఎంసీలోకి..
గతంలో ఎన్నిగంటలు పడితే అన్ని గంటలు ఈ గేమ్ ఆడేందుకు వీలుండేది. అయితే ప్రస్తుతం ఇలా కుదరదు. 18 ఏళ్ల వయసులోపు వారు ఒకపై ఈ గేమ్ ని రోజులో 3 గంటలు మాత్రమే ఆడొచ్చు. 18 ఏళ్ల నిండినవారు 6 గంటలు ఈ గేమ్ ఆడొచ్చు. 18 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు ఈ గేమ్ ఆడాలంటే పేరెంట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది. ఒకవేళ గేమ్ డౌన్ లోడ్ చేసుకున్నా అందరికి ఒకే సారి అందుబాటులోకి రాకపోవచ్చని గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ తెలిపింది. రానున్న 48 గంటల్లో దశలవారీగా యూజర్లకు గేమ్ ఆడేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పింది.
పబ్‌జీ తరువాత అంత క్రేజ్ తెచ్చుకున్న BGMIని గతేడాది కేంద్రం నిషేధించింది. తాజాగా ఈ గేమ్ ని ప్రారంభించేందుకు కేంద్ర అనుమతులను ఇచ్చింది. ప్రస్తుతానికి మూడు నెలలు మాత్రమే ట్రయల్ కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. గేమింగ్ కంపెనీ క్రాఫ్టన్ సర్వర్ లొకేషన్లు, డేటా సెక్యురిటీ పాటించినందుకు 3 నెలల ట్రయల్ కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. యూజర్లపై ఈ గేమ్ ప్రభావం, ఎడిక్షన్ వంటి అంశాలను పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ కారణాల వల్లే ఈ గేమ్ ఆడేందుకు కొన్ని నిబంధనలను, టైమ్ లిమిట్ ని తీసుకువచ్చింది.
