Site icon NTV Telugu

Best LED Projector: ఇంట్లో థియేటర్ ఫీలింగ్ రావాలంటే.. ఇదే బెస్ట్ ఆఫ్షన్…

Untitled Design (9)

Untitled Design (9)

మీ ఇంట్లోనే సినిమా హాల్ గా ఫీల్ పొందాలనుకుంటున్నారా. అయితే మీకు బెస్ట్ ఆఫ్షన్ ఇదే.. కేవలం పదివేలతో ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అనేక అధిక-నాణ్యత ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 10,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. బెస్ట్ ప్రైజ్ లోనే మీరు స్మార్ట్ LED ప్రొజెక్టర్ ని పొందవచ్చు.

Read Also:Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

ప్రస్తుతం మార్కెట్లో అధిక-నాణ్యత ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 10,000 నుంచి 15,000 రూపాయల మధ్య ప్రారంభమవుతుంది. పోర్ట్రోనిక్స్ అనే కంపెనీ నుంచి ఇటీవల భారతదేశంలో తన కొత్త స్మార్ట్ ఎల్ఈడీ ప్రొజెక్టర్, బీమ్ 550 ను విడుదల చేసింది. వీటితో పాటు అదనంగా రెండు కొత్త ప్రొజెక్టర్లను విడుదల చేసింది. వాటి ధరలు, ఫీచర్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also:Suicide: రెండేళ్ల కుమార్తెతో ట్యాంక్ బండ్ లో దూకి వివాహిత ఆత్మహత్య

పోర్ట్రోనిక్స్ బీమ్ 550 1080p HD రిజల్యూషన్, 6000 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఇది వేగవంతమైన సెటప్, లివింగ్ రూమ్ లేదా బెడ్‌రూమ్‌లోకి సులభంగా సరిపోయే కాంపాక్ట్ బాడీని కూడా అందిస్తుంది. ఇది 100 అంగుళాల వరకు స్క్రీన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇది ఏ గదికైనా సరిపోతుంది. ఈ ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నడుస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. పోర్ట్రోనిక్స్ దీనికి కాంపాక్ట్ ఫోల్డబుల్ డిజైన్, 5W బిల్ట్-ఇన్ స్పీకర్‌ను అందించింది. ఇది AAC, FLAC, MP3, WAV, OGGతో సహా బహుళ ఆడియో ఫార్మాట్‌లకు మద్దతు ఇస్తుంది. అవసరమైతే స్పీకర్లను కనెక్ట్ చేయడానికి ఇది ఇయర్‌ఫోన్-అవుట్ పోర్ట్‌ను కూడా కలిగి ఉంది. ప్రస్తుతం భారతదేశంలో దీని ధర రూ.9,999గా ఉంది..

Read Also:Locals Attack : గాయపడిన వారికి.. సహాయం చేసిన వ్యక్తిపై దాడి చేసిన కుటుంబ సభ్యులు

గత వారం XElectron గృహ, కార్యాలయ వినియోగం కోసం దాని స్మార్ట్ LED ప్రొజెక్టర్ శ్రేణిని ప్రవేశపెట్టింది. ఇందులో ప్రొజెక్టర్ 1 ప్లస్, ఐప్రొజెక్టర్ 2 ప్లస్ మోడల్‌లు ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ.15,990, రూ.17,990గా ఉన్నాయి. ఇది పోర్టబుల్ టేబుల్‌టాప్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. 2.9 కిలోగ్రాముల బరువు ఉంటుంది.

Exit mobile version