Best Banks For Gold Loan: బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది అత్యవసర సమయాల్లో ఆదాయ వనరుగా కూడా పని చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది మెడికల్ ఖర్చులకు, ఎడ్యుకేషన్, బిజినెస్ కోసమని బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్లు తీసుకుంటుంటారు. దీనికి క్రెడిట్ స్కోర్ అనేది అవసరం. అలాగే వీటిల్లో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. క్రెడిట్ స్కోర్ లేనివారు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్లు కోరుకునే వారు గోల్డ్ లోన్ అనే బెటర్ ఛాయిస్‌గా నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏ బ్యాంకుల్లో బంగారంపై తక్కువ వడ్డీ లభిస్తుందో తెలుసా..
READ ALSO: Samantha : కొత్త ఇంట్లో అడుగు పెట్టిన సమంత.. పూజలు
ఇంతకీ గోల్డ్ లోన్ అంటే ఏమిటో తెలుసా..
గోల్డ్ లోన్ అంటే ఏంటో తెలుసా.. బంగారు ఆభరణాలను బ్యాంకు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC)కి దగ్గర తాకట్టు పెట్టడం ద్వారా తీసుకునే లోన్. ఇక్కడ లెండర్ బంగారం స్వచ్ఛత, బరువును చూసి దాని విలువ ఆధారంగా లోన్ అమౌంట్ అనేది ఇస్తారు. డబ్బులు తీసుకున్న వాళ్లు దానిని తిరిగి చెల్లించిన తర్వాత బంగారాన్ని తిరిగి అందజేస్తారు. బంగారు రుణాలపై వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు, NBFC లను బట్టి మారుతాయని నిపుణులు చెబుతున్నారు.
బ్యాంకులు, NBFCలు సాధారణంగా 18 నుంచి 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకుంటాయి. ప్రతి కస్టమర్‌కు 50 గ్రాముల వరకు బ్యాంక్-ప్రింటెడ్ నాణేలు (24 క్యారెట్లు) తాకట్టు పెట్టే అవకాశం ఉంటుంది. రాళ్లు ఉన్న ఆభరణాలను తాకట్టు పెట్టవచ్చు. కానీ లోన్ అమౌంట్ కాలిక్యులేట్ చేసేటప్పుడు సాధారణంగా రాళ్ల విలువను తీసేస్తారు. హెయిర్‌పిన్స్, గోల్డ్ వాచెస్, బంగారు పాత్రలు, వైట్ గోల్డ్, ఇమిటేషన్ జ్యూవెలరీ లేదా బంగారు కడ్డీలు వంటి వస్తువులను తాకట్టు పెట్టుకోడానికి బ్యాంకులు, NBFCలు అంగీకరించవు. బంగారు పూత పూసిన లేదా మరొక లోహంపై బంగారం పలుచని పొర మాత్రమే ఉన్న ఆభరణాలను తాకట్టు పెట్టుకోడానికి అంగీకరించరు.
ఏ బ్యాంకుల్లో ఎంత వడ్డీలో తెలుసా..
ప్రభుత్వ రంగ బ్యాంకులు:
కెనరా బ్యాంక్ – 8.90%
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 10.00%
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 9.65%
పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 8.35%
బ్యాంక్ ఆఫ్ ఇండియా / బ్యాంక్ ఆఫ్ బరోడా – 9.40%
ఇండియన్ బ్యాంక్ – 8.75%
ప్రైవేట్ రంగ బ్యాంకులు:
ఐసీఐసీఐ బ్యాంక్ – 9.15%
కోటక్ మహీంద్రా బ్యాంక్ – 9.00%
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ – 9.30%
ఇండస్ఇండ్ బ్యాంక్ – 10.50%
యాక్సిస్ బ్యాంక్ – 9.75%
NBFCలు:
మణప్పురం ఫైనాన్స్ – 15.00%
బజాజ్ ఫిన్‌సర్వ్ – 9.50%
ముత్తూట్ ఫైనాన్స్ – 22.00%
ఐఐఎఫ్‌ఎల్- 11.88%
READ ALSO: Hibatullah Akhundzada: పాక్ – ఆఫ్ఘన్ యుద్ధం.. ఇంతకీ హిబతుల్లా అఖుంద్జాదా ఎవరు?
