NTV Telugu Site icon

Nirmala Sitharaman: ఎస్‌బీఐ మరింత విస్తరణ.. త్వరలో 500 బ్రాంచ్‌లు ప్రారంభం

Sbi

Sbi

బ్యాంకుల వడ్డీ రేట్లు మరింత సరసమైన ధరకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 11వ ఎస్‌బీఐ బ్యాంకింగ్ మరియు ఎకనామిక్స్ కాన్‌క్లేవ్ 2024లో సీతారామన్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను మరింత విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా మరో 500 బ్రాంచీలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీంతో బ్యాంకు బ్రాంచీల సంఖ్య 23 వేలకు చేరుతుందన్నారు.

ఇది కూడా చదవండి: Thiruchendur: విషాదం.. ఆలయంలో ఏనుగుకు పండ్లు తినిపిస్తుండగా దాడి, ఒకరి మృతి

1921 నుంచి బ్యాంకు ఎలా విస్తరించిందో సీతారామన్ గుర్తుచేశారు. ‘‘అప్పట్లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1955లో పార్లమెంట్‌లో చట్టం చేసి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చారు. 1921లో 250 బ్రాంచీలు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 22,500కు పెరిగింది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి మరో 500 బ్రాంచీలు అందుబాటులోకి రానున్నాయి’’ అని ఆర్థిక మంత్రి వివరించారు. ప్రస్తుతం ఎస్‌బీఐకి 50 కోట్లకు పైగా కస్టమరన్లు ఉన్నారని, దేశంలోని మొత్తం డిపాజిట్లలో ఈ బ్యాంకు వాటా 22.4శాతంగా ఉందని వెల్లడించారు. డిజిటల్‌ పెట్టుబడులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. రోజుకు 20 కోట్ల యూపీఐ లావాదేవీలను బ్యాంకు నిర్వహిస్తోందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Pakistan: సోషల్ మీడియాలో పాక్ నటి ప్రైవేటు వీడియో లీక్.. ఖండించిన మథిర