NTV Telugu Site icon

Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఐదు రోజులే పని..?

Bank

Bank

బ్యాంకుల వల్ల జనాలకు ఎంతో మేలు జరుగుతుంది.. ఎన్నో విధాలుగా అవి మనకు ఉపయోగపడుతున్నాయి.. రోజు రోజుకు బ్యాంక్ కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతుంది.. దాంతో ఉద్యోగులకు పని భారం కూడా పెరుగుతుంది.. కొత్తగా ఉద్యోగులను తీసుకున్న కూడా కొన్ని పనులు ఆగిపోతున్నాయి.. దీంతో ఉద్యోగులు ఎక్కువ టైం ఉద్యోగం చేస్తూ ప్రజల అవసరాలను కూడా తీరుస్తున్నారు.. దాంతో కొంత మంది సాధారణ ఉద్యోగస్తులు, ప్రైవేట్‌ ఉద్యోగస్తులు బ్యాంకు సేవలను పొందాలంటే కచ్చితంగా సెలవు పెట్టాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలో సాధారణ రోజుల్లో బ్యాంకుల్లో పని చేసే సమయాన్ని పెంచి వారానికి ఐదు రోజులే సెలవు ఇవ్వాలనే డిమాండ్‌ ఏళ్లుగా ఉంది. అదే విధంగా జీతాల పెంపుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే బ్యాంకు ఉద్యోగులకు కొన్ని రోజుల్లో శుభవార్త రానుంది.. ఈ మేరకు బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం జీతాలను కూడా పెంచుతున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.. బ్యాంక్ యూనియన్లు, అసోసియేషన్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) మధ్య 12వ ద్వైపాక్షిక పరిష్కార చర్చలు చివరి దశకు చేరుకున్నందున ఐదు రోజుల పని వారం అమలు డిసెంబర్ మధ్య నాటికి అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఆయా వర్గాలు తెలిపాయి..

ఇక జీతాల పెంపు విషయంలో డిసెంబర్ 1 నాటికి చర్చలను పూర్తి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ రుణదాతలను కోరింది. ఐదు రోజుల పని వారం ప్రారంభమైన తర్వాత ఇక బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవులు రానున్నాయి. అయితే కోల్పోయిన పని గంటలను భర్తీ చేయడానికి, ఉద్యోగులు వారం రోజులలో ఎక్కువ గంటలు పని చేయాల్సి రావచ్చు. అంటే ప్రస్తుత పని వేళల కంటే 30-45 నిమిషాలు అదనంగా పని చేయాల్సి వస్తుంది. సెలవు రోజుల్లో డిపాజిట్‌ విషయంలో ఇప్పటికే నగదు డిపాజిట్‌ మెషీన్లు అందుబాటులో ఉన్నా, ఈ రెండు రోజుల సెలవు దినాల కారణంగా చెక్కుల రిలీజ్‌పై ప్రభావం పడుతుందని వివరించారు.. అన్ని రంగాల్లో ఉద్యోగులకు ఐదు రోజులే ఉండటంతో ఇక్కడ కూడా ఐదు రోజులే ఉండవచ్చు అని సమాచారం..