బంధన్ బ్యాంక్ తాత్కాలిక ఎండీ & సీఈవోగా రతన్ కుమార్ కేష్‌ను బ్యాంక్ నియమించింది. ప్రస్తుత ఎండీ & సీఈవో అయిన చంద్ర శేఖర్ ఘోష్ జూలై 9, 2024న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో ఈ నెల 10 నుంచి రతన్ కుమార్ తాత్కాలిక ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టానున్నారు. బ్యాంక్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. జూలై 6, 2024న జరిగిన సమావేశంలో రతన్ కుమార్ కేష్ నియామకాన్ని డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. ఈ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదం తెలిపింది.
ఇది కూడా చదవండి: Smartwatch Saves Life: “స్మార్ట్‌వాచ్” ఉపయోగించి విమానంలో మహిళ ప్రాణాలు కాపాడిన డాక్టర్..
కేష్.. ప్రస్తుతం బంధన్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. శాశ్వత MD & CEO నియమించబడే వరకు తాత్కాలిక MD & CEO పాత్రను నిర్వర్తించనున్నారు. గతంలో యాక్సిస్ బ్యాంక్ రిటైల్ కార్యకలాపాలు మరియు సేవలకు అధిపతిగా ఉన్న కేష్.. మార్చి 31, 2023 నుంచి బంధన్ బ్యాంక్‌లో ED & COOగా పని చేస్తు్న్నారు. అంతేకాకుండా వివిధ పరిశ్రమలలో నాయకత్వ పాత్రల్లో కేష్‌కు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. బంధన్ బ్యాంక్‌కు ముందు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌ల్లో సాంకేతికత, డిజిటల్ కార్యక్రమాలు, పాలన, నాణ్యత మరియు కస్టమర్-సెంట్రిక్ స్ట్రాటజీలపై దృష్టి సారించి సంస్థ పరివర్తనలో కేష్ కీలక పాత్రలు పోషించారు.
ఇది కూడా చదవండి: Rahul gandhi: సోమవారం మణిపూర్‌లో రాహుల్ పర్యటన!