Site icon NTV Telugu

Bajaj Platina: తక్కువ ధర , ఎక్కువ మైలేజ్‌తో మార్కెట్లోకి.. బజాజ్ ప్లాటినా..

Untitled Design (6)

Untitled Design (6)

భారతదేశంలో మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా టూ–వీలర్లు కొనుగోలు చేస్తారు. తక్కువ ధరలో, సింపుల్ గా ఉండే బైక్‌లను ముఖ్యంగా ఎంచుకుంటారు. అలాంటి అతి తక్కువ ధరలో లభించే బైక్‌లలో బజాజ్ ప్లాటినా ముందుంటుంది. బజాజ్ కంపెనీ తాజాగా ప్లాటినా బైక్‌ను రెండు వేరియెంట్లలో అందిస్తోంది. ప్లాటినా 100 మరియు ప్లాటినా 100 డ్రమ్. అయితే..ప్లాటినా 100 ధర ₹65,407, ప్లాటినా 100 డ్రమ్ ధర ₹69,284గా ప్రకటించింది యాజమాన్యం.

ఇవి ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత అఫోర్డబుల్ సెగ్మెంట్‌కు చెందిన బైక్‌లు. ప్లాటినా 100లో 102cc DTS-i సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఇంజిన్ ఉపయోగించారు. తక్కువ పెట్రోల్‌తో ఎక్కువ మైలేజ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లు. ఫుల్ ట్యాంక్‌తో దాదాపు 700–800 కిలోమీటర్లు నడుస్తుందని యాజమాన్యం వెల్లడించింది.

మరొకవైపు, ప్లాటినా 100 డ్రమ్ 115.45cc, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుందని తెలిపింది. అధునాతన FI టెక్నాలజీ వల్ల థ్రాటిల్ రెస్పాన్స్ మెరుగ్గా ఉండి, ఎత్తైన ప్రదేశాల్లో కూడా సాఫీగా నడిచే సామర్థ్యం ఉందని బజాజ్ సిబ్బంది తెలిపారు.

తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ మైలేజ్ కోరుకునేవారికి బజాజ్ ప్లాటినా ఇప్పటికీ ఉత్తమ ఎంపిక. రోజువారీ ప్రయాణాలకు ప్లాటినా 100 అద్భుతంగా పనిచేస్తే, లాంగ్ ట్రిప్స్ కోసం ప్లాటినా 110 మరింత శక్తివంతమైన ప్రత్యామ్నాయం.

Exit mobile version