NTV Telugu Site icon

Bajaj Scooter: బ‌జాజ్ నుంచి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌…

దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం భారీగా పెరిగింది. అనేక స్టార్ట‌ప్ కంపెనీల‌తో పాటు ఇప్ప‌టికే దేశంలో వాహ‌నాల‌ను త‌యారు చేస్తున్న ప్ర‌సిద్ధ కంపెనీలు కూడా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. దీశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం బ‌జాజ్ చేత‌క్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొన్ని ప్రాంతాల్లో చేత‌క్ వాహ‌నాల‌ను విక్ర‌యిస్తుండ‌గా, ఇప్పుడు మ‌రో 12 న‌గ‌రాల్లో బ‌జాజ్ చేత‌క్ వాహ‌నాల‌ను విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించింది. కోయంబత్తూర్, మధురై, కొచ్చి, కోజికోడ్, హుబ్లీ, విశాఖపట్నం, నాసిక్, వసాయ్, సూరత్, ఢిల్లీ, ముంబై, న‌గ‌రాల్లో బుకింగ్స్ ప్రారంభించింది. బ‌జాజ్ చేత‌క్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాన్ని బుక్ చేసుకున్న‌వారికి నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో వాహ‌నాన్ని డెలివ‌రీ చేయ‌నున్నారు. బ‌జాజ్ చేత‌క్ ఎలక్ట్రిక్ వాహ‌నాలకు డిమాండ్ పెర‌గ‌డంతో ఉత్పత్తిని పెంచేందుకు రూ. 300 కోట్ల పెట్టుబ‌డితో ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని పెంచుతున్న‌ట్టు బ‌జాజ్ పేర్కొన్న‌ది.

Read: Indian Army: మోకాళ్లలోతు మంచులో…ప్రాణాల‌కు తెగించి ప‌హారా…