దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. చమురు ధరలు భారీగా పెరగడం, రాబోయే రోజుల్లో చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాహనాల వినియోగం పెరగడంతో కొత్త కొత్త టెక్నాలజీతో వాహనాలను తయారు చేస్తున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ ఫేషియల్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేసింది అవెరా ఏఐ మొబిలిటి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. అవెరా విన్సెరో పేరుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దుబాయ్ ఎక్స్‌పోలో లాంచ్ చేశారు.
Read: Electricity Bill: వాడకుండానే బిల్లు వాచిపోయింది… ఇక వాడితే…
దీనిని ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్‌లో ఈ అవెరా విన్సెరో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నట్టు కంపెనీ వ్యవస్థాపకులు పేర్కొన్నారు. ఏపీతో తయారు చేసే ఈ వాహనాలను విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఒకసారి చార్జ్ చేస్తే 200 కిమీ వరకు ప్రయాణం చేయవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ అవెరా విన్సెరో స్కూటర్ ధర ఎంత అనే విషయాలను కంపెనీ వర్గాలు ప్రకటించాల్సి ఉంది.