ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. అందులో వృద్ధాప్యం కోసం అందిస్తున్న స్కీమ్ లలో ఒకటి అటల్ పెన్షన్ యోజన.. ఇందులో డబ్బులను పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను అందిస్తుంది.. ఈ స్కీమ్ లో ప్రతి నెలా కేవలం రూ.210 ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.5000 పెన్షన్ పొందవచ్చు. అంటే ప్రతిరోజూ రూ.7 మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అటల్ పెన్షన్ యోజనను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది..
ఇక ఇందులో మీ డబ్బుకు భద్రత ఉండటంతో పాటుగా రూ.1000 నుంచి రూ.5వేల వరకు పెన్షన్ ను పొందవచ్చు.. ఇకపోతే 18నుంచి 40 ఏళ్లలోపు వారు ఇందులో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. పథకం కింద, చందాదారుడికి 60 ఏళ్లు నిండిన తర్వాత, అతని సహకారం ఆధారంగా నెలవారీ పెన్షన్ రూ.1,000 నుండి రూ.5,000 వరకు హామీ ఇవ్వబడుతుంది.. వినియోగదారుడు మరణిస్తే అతని భార్యకు మొత్తాన్ని చెల్లిస్తారు..
ఈ పెన్షన్ యోజన కింద, పదవీ విరమణ తర్వాత కూడా నెలవారీ పెన్షన్ రూ 1,000 నుండి రూ 5,000 వరకు ఉంటుంది. ఒక వ్యక్తికి 18 ఏళ్లు నిండి , 60 ఏళ్ల తర్వాత రూ.5000 పింఛను కావాలంటే, అతను ప్రతి నెలా రూ.210 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మూడు నెలల్లో రూ.626కి, ఆరు నెలల్లో రూ.1239కి అదనంగా ఇవ్వొచ్చు. అదే విధంగా మీరు నెలకు రూ.1,000 పెన్షన్ పొందడానికి, మీరు 18 ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెడితే, మీరు నెలకు రూ.42 చెల్లించాలి.. ఇలా కూడా నెలకు పెన్షన్ ను పొందవచ్చు.. ఇదే కాదు వృద్ధుల కోసం ఎన్నో స్కీమ్ లను ప్రభుత్వం అందిస్తుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..