Site icon NTV Telugu

Arattai App: అదరగొడుతున్న ‘అరట్టై’ యాప్.. వాట్సప్‌తో పోరుకు సిద్ధమైన ఇండియన్ యాప్!

Arattai App

Arattai App

Arattai App: స్వదేశీ పరిజ్ఞానంతో చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్‌ రూపొందిన మెసేజింగ్‌ యాప్‌ ‘అరట్టై’ ప్రస్తుతం దేశంలో ట్రెండవుతోంది. ఇంతకు ఈ యాప్ దేనికి పోటీగా వచ్చిందో తెలుసా.. సాక్ష్యాత్తు వాట్సప్‌కు. ఇక్కడ ఒక ప్రముఖ విషయం ఏంటో తెలుసా.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తాజాగా ఈ యాప్‌ను ప్రోత్సహిస్తూ ప్రజలు వాడాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ యాప్‌ వార్తల్లోకెక్కింది. మరొక విశేషం ఏంటంటే.. ప్రస్తుతం ఈ యాప్‌ యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ విభాగంలో నంబర్‌-1 స్థానంలో దూసుకుపోతుంది.

READ ALSO: VC Sajjanar : సజ్జనార్ సాధారణ ప్రయాణం.. అందరూ షాక్..!

తమిళ్‌లో అరట్టై అంటే మాట్లాడుకోవడం..
ఈ యాప్‌ను జోహో కార్పొరేషన్‌ రూపొందిన విషయాన్ని చెప్పుకున్నాం. ఇంతకీ అరట్టై అంటే ఏమిటో తెలుసా.. తమిళంలో ‘అరట్టై’ అంటే ‘మాట్లాడుకోవడం’ అని అర్థం. ఈ యాప్‌ను జోహో కార్పొరేషన్‌ 2021లోనే లాంచ్‌ చేసింది. అయితే ప్రస్తుతం దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. జోహో వాళ్లు దీనిని టెక్స్ట్‌ మెసేజులు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పంపడం, వాయిస్‌/వీడియో కాల్స్‌ చేయడం, స్టోరీస్‌, ఛానల్స్‌ క్రియేట్‌ చేయడం.. వంటి పర్సనల్‌ పనుల నుంచి ప్రొఫెషనల్‌ వాడకానికి కూడా ఉపయోగపడేలా డిజైన్‌ చేశారు. అలాగే దీంట్లో వన్‌-టు-వన్‌, గ్రూప్‌ చాట్స్‌, వాయిస్‌ నోట్స్, బ్రాడ్‌కాస్ట్ ఛానల్స్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి.

స్వదేశీ ప్లాట్‌ఫాం జోహో తీసుకొచ్చిన మెసేజింగ్ యాప్‌ ‘అరట్టై’ క్లౌడ్‌ ఆధారిత సర్వీసులు అందిస్తుంది. తాజాగా ఇది డౌన్‌లోడ్స్‌లో దూసుకెళ్తూ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది. కేవలం మూడు రోజుల్లోనే రోజువారీ సైన్అప్స్‌ 3 వేల నుంచి 3.5 లక్షలకు పెరిగాయి అంటే అర్థం చేసుకోవచ్చు.. యూత్‌లో దీనిపై ఎంత క్రేజ్ ఏర్పడిందో. తాజాగా జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. మూడు రోజుల్లో తమ యాప్ వంద రెట్ల వృద్ధి సాధించిందన్నారు. కొందరు దీన్ని ‘వాట్సప్‌ కిల్లర్‌’గా పేర్కొంటున్నారు.

స్థానిక యాప్‌గా క్రేజ్‌..
ప్రస్తుతం అరట్టై స్థానిక యాప్‌గా క్రేజ్‌ సొంతం చేసుకుంటోంది. ఇప్పటికి అయితే అరట్టై యాప్‌లో కాల్స్‌కు మాత్రమే ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉంది. మెసేజులకు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సదుపాయం లేదు. అంటే మీ మెసేజులను థర్డ్‌ పార్టీ వ్యక్తులు కూడా చూడొచ్చని పలు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రైవసీకి అధిక ప్రాధాన్యం ఇచ్చే యూజర్లకు ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంటున్నారు. నిర్వాహకులు మున్ముందు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ అనేది తీసుకొస్తారో లేదో చూడాలి. వాస్తవానికి కంపెనీ ఈ యాప్‌ను అదనపు ఫీచర్లతో నవంబర్‌లో పెద్దఎత్తున రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించింది. కానీ నెల మందే యూజర్లు విపరీతంగా పెరగడంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విస్తరణపై జోహో టీమ్‌ దృష్టిసారించినట్లు సమాచారం. ఓటీపీ ఆలస్యమవడం, కాంటాక్ట్‌ సింక్‌ సమస్యలు, కాల్‌ ఫెయిల్యూర్లు వంటి ఇబ్బందులు కొందరు యూజర్లు రిపోర్ట్‌ చేస్తున్నారు. దీన్ని జోహో అంగీకరించింది. త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామని స్పష్టంగా చెప్పింది. వాట్సప్‌ లాంటి గ్లోబల్‌ దిగ్గజానికి దీటుగా నిలవాలంటే ఈ లోటు భర్తీ చేయాల్సిందేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్‌డేట్లు, కొత్త ఫీచర్లు చేర్చుకుంటూ వెళితే కచ్చితంగా వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రధాని మోదీ దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న పిలుపు మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తాజాగా తాను జోహోకు మారుతున్నట్లు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌ పవర్‌పాయింట్ బదులు జోహోతోనే తాజా కేబినెట్‌ ప్రంజెంటేషన్‌ తయారు చేసినట్లు చెప్పారు. ఇదే తరహాలో ‘అరట్టై’ని వాడాలంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ కూడా పిలుపునివ్వడంతో డౌన్‌లోడ్లు గణనీయంగా పెరిగాయి. దీంతో అరట్టై ఆండ్రాయిడ్, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో నెట్‌వర్కింగ్‌ విభాగంలో నంబర్‌-1 స్థానంలో నిలిచింది.

READ ALSO: Donald Trump: డూ ఆర్ డై గేమ్ ఆడుతున్న ట్రంప్.. గెలిస్తే నోబెల్ పక్కా అంటా!

Exit mobile version