Site icon NTV Telugu

Tim Cook: ఆపిల్ సీఈఓగా టిమ్ కుక్ రిటైర్మెంట్! ఆయన ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా?

Tim Cook

Tim Cook

Tim Cook: ఆపిల్ కంపెనీలో ఒక శకం ముగియబోతోంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ దిగ్గజాల్లో ఒకటిగా ఆపిల్‌ను తీర్చిదిద్దిన టిమ్ కుక్ తన సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో జాన్ టర్నస్ ఆపిల్ నూతన సారథిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. టిమ్ కుక్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఆయన ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా.. అలాగే ఆయన ప్రస్థానం ఆపిల్‌లో ఎప్పుడు ప్రారంభం అయ్యింది అనే వివరాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Lady Super Star : రూటు మార్చిన లేడి సూపర్ స్టార్ ఒక వైపు సీనియర్.. మరో వైపు జూనియర్ హీరోలతో బిజీ

టిమ్ కుక్ 1998లో ఆపిల్ కంపెనీలో చేరారు. అంతకుముందు ఆయన IBMలో 12 ఏళ్ల పాటు పనిచేశారు. ఆపిల్‌లో ఆయన తన స్టార్టింగ్ స్టేజ్‌లో ఆపరేషన్స్, సప్లై చైన్ విభాగంలో కెరీర్ ప్రారంభించి, తర్వాత చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్‌ స్థాయికి ఎదిగారు. 2011లో స్టీవ్ జాబ్స్ అనారోగ్య కారణాలతో తప్పుకున్న తర్వాత కుక్ ఆపిల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సుమారు 15 ఏళ్ల పాటు సీఈఓగా ఉండి, కంపెనీని 4 ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా మార్చారు. ప్రస్తుతం ఆయన తన పదవి నుంచి తప్పుకున్నాక, కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

టిమ్ కుక్ నికర ఆస్తుల విలువ ..
ఫోర్బ్స్ తాజా లెక్కల ప్రకారం.. టిమ్ కుక్ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఆయన మొత్తం ఆస్తి విలువ సుమారు 2.9 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.27,124 కోట్లు అని అంచనా). కుక్ ఆస్తిలో మెజార్టీ భాగం ఆపిల్ షేర్ల రూపంలో ఉంది. ఆయన వద్ద 30 లక్షలకు పైగా ఆపిల్ షేర్లు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో షేర్లు ఉన్నప్పటికీ, కంపెనీలో ఆయన వాటా కేవలం 1 శాతం మాత్రమే. గత కొన్ని ఏళ్లలో ఆయన మిలియన్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించి తన వ్యక్తిగత సంపదను పెంచుకున్నారు.

టిమ్ కుక్ హయాంలో ఆపిల్ సాధించిన ఆర్థిక విజయాలు అసాధారణమైనవి. 2011లో 350 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆపిల్ మార్కెట్ విలువ, ఇప్పుడు దాదాపు 4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అలాగే 2011లో కంపెనీ ఆదాయం 108 బిలియన్ డాలర్లు కాగా, 2025 నాటికి అది 416 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఆపిల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సీఈఓగా టిమ్ కుక్ తనదైన ముద్ర వేసి, ఇప్పుడు ఆ వారసత్వాన్ని జాన్ టర్నస్‌కు అప్పగిస్తున్నారు.

READ ALSO: CSK Injury Update: సీఎస్‌కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి మ్యాచ్ విన్నర్ అవుట్.. గుడ్ న్యూస్ ఏంటంటే?

Exit mobile version