Tim Cook vs Trump: భారతదేశంలో ఐఫోన్లు తయారీ చేపట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. మే నెలలో దోహా పర్యటన సందర్భంగా తన మనసులో మాటను అతడు బయట పెట్టాడు. ఇండియాలో తయారీ చేయడం తనకు ఏ మాత్రం ఇష్టంలేదంటూ టిమ్ కుక్ సమక్షంలోనే తెలియజేశాడు. అలాగే, ట్రేడ్ డీల్ విషయంలో కోపంగా ఉన్న ట్రంప్.. భారత్‌పై 25 శాతం టారీఫ్స్ విధించారు. అయితే, అందులో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు మినహాయింపు ఇచ్చాడు. దీంతో ప్రస్తుతానికి ఐఫోన్లపై ఎలాంటి సుంకాల ఎఫెక్ట్ లేనట్లే. కానీ, మున్ముందూ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని విశ్లేషకులు వెల్లడించారు.
Read Also: Tollywood: సినిమానా మజాకా.. అప్లికేషన్ దెబ్బకి సైట్ క్రాష్
అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఏమాత్రం పట్టించుకోలేదు. యాపిల్ కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా కుక్ మాట్లాడుతూ.. గత త్రైమాసికంలో కొనసాగిన వైఖరే భవిష్యత్ లో కూడా కొనసాగుతుందని తెలియజేశారు. యూఎస్ లో విక్రయమయ్యే ఫోన్లు దాదాపుగా భారత్‌లో తయారు చేసినవే అన్నారు. న్యూయార్క్ లో ఉపయోగించే ఇతర యాపిల్ ప్రొడక్ట్స్ మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, యాపిల్ వాచ్‌లను వియత్నాంలో తయారు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే, ఇతర దేశాలకు చైనా నుంచి ఎగుమతి చేస్తున్నామని టిమ్ కుక్ పేర్కొన్నారు.
Read Also: YS Jagan: అమరావతిపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
ఇక, తయారీపరంగానే కాదు.. ఆదాయం పరంగానూ యాపిల్‌కు భారతదేశం కలిసొచ్చింది అని టిమ్ కుక్ తెలిపారు. ఐఫోన్ల విక్రయం ద్వారా భారత్‌లో రికార్డు రెవెన్యూ వృద్ధి నమోదు చేసిందన్నారు. భారత్, పశ్చిమాసియా, దక్షిణాసియా, బ్రెజిల్‌లో అద్భుతమైన ఫలితాలను నమోదు చేసినట్లు వెల్లడించారు. వరల్డ్ వైడ్ గా సగటున 10 శాతం వృద్ధి నమోదైందని తెలియజేశారు. అంతేకాదు భారత్‌లో రిటైల్ విక్రయాలను పెంచేందుకు మరిన్ని ఫిజికల్ స్టోర్లను త్వరలో తెరవబోతున్నట్లు అనలిస్ట్ కాల్‌లో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్పుకొచ్చారు.
