ప్రముఖ కంప్యూటర్, మొబల్ ఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్ సంస్థ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించేందుకు సిద్దం అవుతున్నది. యాపిల్ అటోనమస్ పేరుతో ఈ కారును తయారు చేసింది. భారత సంతతికి చెందిన దేవాంగ బొర అనే మెకానికల్ ఇంజనీర్ ఈ కారును డిజైన్ చేశారు. పెద్దని గుండ్రంగా ఉన్న గోళం దానికి నాలుగు చక్రాలు ఉన్న అటోనమస్ చూసేందుకు అచ్చంగా పిల్లలు ఆడుకునే బొమ్మలా ఉన్నది. ఈ ఎలక్ట్రిక్ కారుకు డ్రైవర్ అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.
Read: Honda: బంపర్ ఆఫర్…ఆ బైక్‌పై రూ. లక్ష తగ్గింపు…
డెస్టినేషన్ ను సెట్ చేసుకుంటే చాలు. ఇక ప్రయాణికులు దిగిన తరువాత యాపిల్ అటోనమస్ కారు పార్కింగ్ ప్రదేశానికి వెళ్లి లాక్ అయిపోతుంది. పూర్తిగా కంప్యూటరైజ్డ్ ఎలక్ట్రిక్ కారు కావడం, ఆకర్షణీయంగా ఉండటంతో ఈ కారుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న ఈ కారు మరో రెండేళ్ల వ్యవధిలోనే మార్కెట్లోకి రాబోతున్నట్టు యాపిల్ సంస్థ తెలియజేసింది.