Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anjali Sardana: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం, కిరాణా సామగ్రి 10 నిమిషాల్లో ఇంటికి రావడం మనకు అలవాటైపోయింది. అయితే ఇప్పుడు అదే తరహాలో ‘ఇంటి పని’ కూడా నిమిషాల్లోనే పూర్తయ్యే రోజులు వచ్చేశాయి. ఈ వినూత్న ఆలోచనతో 23 ఏళ్ల అంజలి సర్దానా అనే యువతి అతి తక్కువ కాలంలోనే వేల కోట్ల రూపాయల కంపెనీకి అధినేత్రిగా ఎదిగి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఏమిటీ ‘ప్రొంటో’ (Pronto) మేజిక్?
ఈ రోజుల్లో ఇండియాలో పని మనిషిని వెతుక్కోవడం అంటే ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. తెలిసిన వారు చెప్పడమో లేదా సెక్యూరిటీ గార్డులని అడగడమో చేయాలి. తీరా దొరికినా నమ్మకం ఉండదు, పైగా వారు ఎప్పుడు సెలవు పెడతారో తెలియదు. ఈ సమస్యకు పరిష్కారంగా అంజలి సర్దానా ‘ప్రొంటో’ అనే యాప్‌ను తీసుకువచ్చారు. క్విక్ కామర్స్ తరహాలోనే, ఈ యాప్ ద్వారా పని మనిషిని బుక్ చేసుకుంటే కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే హెల్పర్లు మీ ఇంటికి చేరుకుంటారు. ఇల్లు శుభ్రం చేయడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం లేదా వంటలో సహాయం వంటి పనులను ఈ యాప్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు.
Also Read
- Meesho: సోమవారం మీషో షేర్లపైనే అందరి కళ్లు.. రూ. 1,885 కోట్ల వాటా అమ్మేసిన సాఫ్ట్‌బ్యాంక్!
- EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్‌లైన్ ఇదే..!
- Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
- RBI Repo Rate Hike: సామాన్యులకు మరో షాక్.. EMI భారం పెరగనుందా..?
ఏఐ (AI) తో అద్భుతాలు
ఈ స్టార్టప్ విజయం వెనుక అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అల్గారిథమ్స్ ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఏ సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉందో ఏఐ అంచనా వేస్తుంది. దీనివల్ల వర్కర్లు కస్టమర్ ఇంటికి వేగంగా చేరుకోగలుగుతున్నారు. వర్కర్ల రేటింగ్, కస్టమర్ల ప్రాధాన్యతలను బట్టి సేవలు మెరుగుపరచబడతాయి. విదేశాల్లో చదువుకుని, ఇన్వెస్ట్మెంట్ కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో అంజలి 2025లో గురుగ్రామ్ వేదికగా ఈ సంస్థను స్టార్ట్ చేశారు. అయితే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన కొన్ని నెలల్లోనే ఈ కంపెనీ విలువ రూ.1700 కోట్ల ($200 Million) మార్కుకు చేరుకుంది. గతేడాది డిసెంబర్లో రోజుకు 3,000 బుకింగ్స్ ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 26,000 మార్కును దాటేసింది. తాజాగా ఈ సంస్థ సుమారు 20 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది.
సామాజిక బాధ్యత.. భద్రత..
కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా, గృహ కార్మికుల భద్రతకు కూడా అంజలి పెద్దపీట వేశారు. వర్కర్లకు శిక్షణ ఇవ్వడం, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడమే కాకుండా, మహిళా వర్కర్ల కోసం యాప్‌లో SOS ఫీచర్, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణను కూడా అందిస్తున్నారు. ఈ యాప్ గ్రాండ్ సక్సెస్ సాధిస్తున్నప్పటికీ, గిగ్ వర్కర్ల ప్రయోజనాలు, లాభదాయకతపై విశ్లేషకులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ డిస్కౌంట్లతో మార్కెట్‌ను ఆక్రమిస్తున్న ఈ కంపెనీలు, భవిష్యత్తులో నిలదొక్కుకుంటాయా అనేది చూడాలి. ఇప్పటికే అర్బన్ కంపెనీ వంటి దిగ్గజాలు కూడా ఈ ఇన్ స్టంట్ సర్వీస్ రంగంలో పోటీ పడుతున్నాయి. మొత్తానికి ఇంటి పనులను కూడా ‘క్విక్ కామర్స్’గా మార్చిన అంజలి సర్దానా.. నేటి యువ స్టార్టప్ పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!