NTV Telugu Site icon

Andhra Pradesh: ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌పై ప్రత్యేక ప్రచారం. లిస్టులో ఆంధ్రప్రదేశ్‌ కూడా..

Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh-Financial Inclusion: ప్రజలకు ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ ఆవశ్యకతను మరింతగా వివరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ జాబితాలోలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒకటైన ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉండటం గమనించాల్సిన విషయం. ఈ ప్రత్యేక ప్రచారం ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగుతుంది. అందరికీ బ్యాంక్‌ అకౌంట్లు, ఇన్సూరెన్స్‌ లేదా పెన్షన్‌ పథకాలు, రైతులకు, మహిళలకు రుణాల పంపిణీ, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, కోల్డ్‌-చెయిన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటు తదితర అంశాలపై క్యాంపెయిన్‌ చేస్తారు.

8 ఏళ్లు.. రెండున్నర లక్షల కోట్లు..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిదేళ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 20 వేల వాణిజ్య ప్రతిపాదనలకు అనుమతులు ఇచ్చామని, వాటి వల్లే ఈ స్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయని చెప్పారు. తద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల తయారీ కేంద్రంగా ఎదిగిందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వాడే టీకాల్లో మూడో వంతుకు పైగా (33 శాతం) తెలంగాణలోనే తయారవుతున్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా జరిగే ఫార్మాలో 35 నుంచి 40 శాతం వరకు ఇక్కడే జరుగుతున్నట్లు తెలిపారు.

Wind Man of India: ‘విండ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ తుల్సి తంతి ఇకలేరు

హైదరాబాద్‌లో హౌజింగ్‌ సేల్స్‌ అదుర్స్‌

ఈ ఏడాది జనవరి, సెప్టెంబర్‌ మధ్య కాలంలో హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల్లో జోష్ నెలకొంది. తొమ్మిది నెలల్లో దాదాపు 36 వేల హౌజింగ్‌ సేల్స్‌ నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో విక్రయించిన ఇళ్ల సంఖ్య కేవలం 14 వేల 376 మాత్రమే. ఈ వివరాలను రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజ్‌ సంస్థ అనరాక్‌ తన నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు మరో 6 నగరాల్లో ఈ ఏడాది ఇప్పటికే 2 లక్షల 72 వేల 709 ఇళ్లు అమ్ముడుపోగా ఇది గతేడాదితో పోల్చితే ఏకంగా 87 శాతం ఎక్కువని అనరాక్‌ తెలిపింది.

Show comments