Amazon Great Republic Day Sale 2026: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 మొదలై 24 గంటలకు పైగా గడిచింది. ఈ ఏడాది అమెజాన్ నిర్వహిస్తున్న తొలి పెద్ద సేల్ ఇదే కావడంతో షాపింగ్ చేసే వాళ్లలో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్స్ నుంచి గృహోపకరణాలు, ఫ్యాషన్ నుంచి గేమింగ్ ల్యాప్‌టాప్‌ల వరకు దాదాపు అన్ని విభాగాల్లో ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గేమింగ్ ల్యాప్‌టాప్‌లు కొనాలనుకునే వారికి ఈ సేల్ బాగా ఉపయోగపడుతోంది. మధ్య స్థాయి ల్యాప్‌టాప్‌లు, హైఎండ్ ప్రీమియం మోడళ్లైపైన డిస్కౌంట్లు ఉన్నాయి. MSI, ఆసుస్, ఏసర్, హెచ్‌పీ, లెనోవో వంటి ప్రముఖ బ్రాండ్లు తమ ల్యాప్‌టాప్‌లపై మంచి తగ్గింపులతో ముందుకు వచ్చాయి. దీంతో గేమింగ్‌కి లేదా హెవీ వర్క్‌కి కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ఇది సరైన సమయంగా మారింది.
ఈ సేల్‌లో డిస్కౌంట్లు మూడు రకాలుగా లభిస్తున్నాయి. మొదటిది నేరుగా ధర తగ్గింపు. ఇది అమెజాన్‌లో రెడ్ కలర్ ట్యాగ్‌తో స్పష్టంగా చూపిస్తున్నారు. అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే గరిష్టంగా 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అయితే ఈ డిస్కౌంట్ 12.5 శాతం వరకు ఉంటుంది. ఇవే కాకుండా, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా ఒక్కసారిగా పెద్ద మొత్తం చెల్లించకుండా, కొన్ని నెలలుగా విడతలుగా చెల్లించవచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ పాత ల్యాప్‌టాప్ లేదా గ్యాడ్జెట్ ఇచ్చి కొత్తదాన్ని కొనుగోలు చేస్తే, అదనంగా డిస్కౌంట్ వస్తుంది. ఈ రెండు ఆఫర్లను కలిపి వాడితే ఖర్చు మరింత తగ్గుతుంది. మొత్తానికి, పాత గ్యాడ్జెట్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకునేవారికి, లేదా కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ కొనాలనుకునేవారికి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 మంచి అవకాశం. ఏయే ల్యాప్‌ట్యాప్‌లపైన ఎంత తగ్గిందో పూర్తి వివరాలు ఈ కింది పట్టికలో చూడొచ్చు.
