Amazon Great Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి తమ కస్టమర్లను ఆకట్టుకునేలా అద్భుతమైన సేల్‌తో ముందుకొచ్చింది. ఇప్పటికే జులై 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ డే సేల్ నిర్వహించిన ఈ- కామర్స్ దిగ్గజం.. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా మరో భారీ సేల్‌ను ప్రకటించింది. అయితే, ఈసారి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ సేల్‌ను ప్రారంభించబోతుంది. ప్రైమ్ మెంబర్లు ఈ సేల్‌కు ఇతరుల కంటే 12 గంటలు ముందే యాక్సెస్ పొందే అవకాశం ఉంటుంది.
Read Also: Asim Munir: పరువు పోయిందిగా.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై చైనా ఆగ్రహం..
కాగా, ఈ బిగ్ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై కొనుగోళ్లకు సుమారు 10 శాతం తక్షణ డిస్కౌంట్ దొరుకుతుంది. అంతేకాదు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐ పద్ధతులు కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. స్మార్ట్‌ఫోన్స్, యాక్సెసరీలు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు, అమెజాన్ డివైజులు లాంటి విభాగాలపై భారీ తగ్గింపులు ఉండబోతున్నాయి. ఇక, లిమిటెడ్ టైమ్ ఆఫర్లు, ట్రెండింగ్ డీల్స్, 8 PM డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్ కూడా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే, ఈ సేల్‌కు సంబంధించిన మైక్రోసైట్‌ను ఇప్పటికే అమెజాన్ తన వెబ్‌సైట్, యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో పూర్తి ఆఫర్ల వివరాలను కంపెనీ అధికారికంగా తెలియజేయనుంది. కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమకు కావాల్సిన ఉత్పత్తులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు అని అమెజాన్ ప్రకటించింది.
