ఎయిర్‌టెల్ మరో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఇది బ్యాంకు కస్టమర్లు అందరికీ ఎంతో ఉపయోగపడనుంది… ఎయిర్‌టెల్ ఏంటి? బ్యాంకు కస్టమర్లకు ఉపయోగపడే సేవను ప్రారంభించడమేంటి? అనే అనుమానాలు రావొచ్చు.. విషయం ఏంటంటే… ఎయిర్‌టెల్ మైక్రో ఏటీఎంని ప్రారంభించింది.. వాటి నుంచి ఏ బ్యాంకు కస్టమర్ అయినా.. నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ పాయింట్‌లలో మైక్రో ఏటీఎం సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మైక్రో ఏటీఎం ద్వారా కస్టమర్ ఒక్కో లావాదేవీకి రూ.10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. దశలవారీగా మైక్రో ఏటీఎంలను ప్రవేశపెడతామని ఈ సందర్భంగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది.
Read Also: Astrology : సెప్టెంబర్ 29, గురువారం దినఫలాలు
కస్టమర్లకు మెరుగైన సౌకర్యాన్ని అందించేందుకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్.. మైక్రో ఏటీఎంను ప్రారంభించింది. దీనితో, దేశంలోని మెట్రో మరియు ఇతర నగరాల వెలుపల నివసిస్తున్న డెబిట్ కార్డ్ వినియోగదారులు నగదు ఉపసంహరణకు మెరుగైన సౌకర్యాన్ని పొందుతారు. వినియోగదారులకు నగదు ఉపసంహరణ సౌకర్యాలను అందించడానికి భారతదేశం అంతటా 5,00,000 బ్యాంకింగ్ పాయింట్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇప్పుడు మైక్రో ఏటీఎం లావాదేవీలను సులభతరం చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) మరియు నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (ఎన్‌ఎఫ్‌ఎస్)తో ఏకీకృతం చేయబడింది.. అన్ని బ్యాంకుల కస్టమర్లు మైక్రో ఏటీఎంల నుండి డబ్బు తీసుకోవచ్చు.. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ పాయింట్‌లో మైక్రో ఏటీఎం సదుపాయాన్ని ఏ బ్యాంక్‌తో అనుబంధించిన కస్టమర్లు అయినా ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఒక కస్టమర్ మైక్రో ఏటీఎం ద్వారా ఒక్కో లావాదేవీకి రూ.10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు అని పేర్కొంది.
మొదట నగరాలు మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో 1,50,000 యూనిట్లను ఏర్పాటు చేస్తుంది ఎయిర్‌టెల్. ఈ ప్రాంతాల్లో సాధారణంగా నగదు ఉపసంహరణ సేవలకు అధిక డిమాండ్ ఉంటుంది.. కానీ, ఏటీఎంల సంఖ్య పరిమితంగా ఉంటుంది. దీంతో, మైక్రో ఏటీఎంలపై దృష్టి సారించింది ఎయిర్‌టెల్.. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గణేష్ అనంతనారాయణన్ మాట్లాడుతూ, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మా కస్టమర్లకు సాధికారత కల్పించేందుకు మైక్రో ఏటీఎంలను ప్రారంభించడం మరో ముందడుగు.. ఇది తమ బ్యాంక్ ప్రారంభించిన మొదటి పరికరం.. ఇది ఆనందాన్ని కలిగిస్తుంది.. ఎందుకంటే ఇది డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి ఏదైనా బ్యాంక్ కస్టమర్లకు సేవలను అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు..