Air India: ఎయిర్ ఇండియా చేతికి మొట్టమొదటి ఎయిర్‌బస్ A350-900.. ఆకాశంలో ఇంద్రభవనం ఈ విమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: టాటా చేతిలోకి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలకు విమానాల ఆర్డర్లను ఇచ్చింది. ఇదిలా ఉంటే శనివారం రోజు ఎయిర్ ఇండియా చేతికి మొట్టమొదటి వైడ్ బాడీ క్యారియర్ ఎయిర్‌బస్ A350-900 అందింది. ఫ్రాన్స్ లోని ఎయిర్‌బస్ ఫెసిలిటీ నుంచి బయలుదేరిన ఈ విమానం ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంది. ఈ తరహా విమానం కలిగిన తొలి భారతీయ ఎయిర్ లైనర్‌గా ఎయిర్ ఇండియా నిలిచింది.

Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ఎయిర్ ఇండియా 20 ఎయిర్ బస్ A350-900 ఆర్డర్లలో ఇది మొదటి విమానం. మరో ఐదు విమానాలు మార్చి 2024 వరకు డెలివరీ కానున్నాయి. ఎయిర్ బస్ A350-900 జనవరి 2024 నుంచి కమర్షియల్ సర్వీసులోకి ప్రవేశించనుంది. ప్రారంభంలో సిబ్బందికి, ఇతర టెక్నీషియన్లకు పరిచయం కోసం దేశీయంగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ విమానాన్ని ఇంటర్నేషనల్ రూట్లలో ఆపరేట్ చేయనున్నారు. సుదూర ప్రాంతాలకు నాన్ స్టాప్ మార్గాల్లో ప్రయాణించడం ఈ విమానం ప్రత్యేకత అని ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ కాంప్‌బెల్ విల్సన్ అన్నారు.
ఎయిర్ ఇండియా A350-900లో 3 క్లాస్ క్యాబిన్ కాన్ఫిగరేషన్‌లో ఉంటుంది. మొత్తం 316 సీట్లు ఉంటాయి. 28 ప్రైవేట్ బిజినెస్ క్లాన్ సూట్లు కాగా.. 24 ప్రీమియం ఎకానమి.. 264 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. సాధారణంగా చెప్పాలంటే ఆకాశంలో ప్రయాణించే ఇంద్ర భవనంగా ఈ విమానాన్ని అభివర్ణించవచ్చు.

ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్ సంస్థతో 250 విమానాల కోసం ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం వచ్చిన విమానం ఈ ఒప్పందంలో మొదటిది. ఎయిర్ ఇండియా మొత్తం 20 A350 విమానాలు, 20 A350-900 విమానాలు, 210 A320neo విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు మరో విమాన తయారీ సంస్థ బోయింగ్‌తో 220 విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. బోయింగ్, ఎయిర్‌బస్ నుంచి 470 కొత్త విమానాలను ఎయిర్ ఇండియా కొనుగోలు చేస్తోంది.
India's first @Airbus A350-900 has come home in the bold, new Air India livery, and it received a grand welcome at @DelhiAirport.
It is touchdown of a new Air India. For a new, resurgent India.#AI350 #AirIndia #FlyAI #ThisIsNewAirIndia pic.twitter.com/V1vKk6m81V
— Air India (@airindia) December 23, 2023
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?