NTV Telugu Site icon

Air India: ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్.. కేవలం రూ.1,499కే విమాన టిక్కెట్లు!

Airindia

Airindia

విమాన ప్రయాణం చేయాలని అంతా కలలుకంటుంటారు. కానీ, ఛార్జీలు వేలల్లో ఉండడంతో సామాన్యులకు సాధ్యపడదు. అయితే ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. చౌక ధరలోనే విమాన ప్రయాణం చేయొచ్చు. ఎలా అంటే? ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా విమాన టికెట్స్ పై ఆఫర్లు ప్రకటించింది. ఎయిరిండియా తీసుకొచ్చిన నమస్తే వరల్డ్ సేల్ లో భాగంగా కేవలం రూ.1499కే విమాన ప్రయాణం కల్పిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల టికెట్లపై భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు తెలిపింది.

ఈ సేల్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండనున్నది. ఫిబ్రవరి 2 నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభమై ఫిబ్రవరి 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో బుకింగ్ చేసుకున్న వారు ఫిబ్రవరి 12 నుంచి అక్టోబర్ 31వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చని తెలిపింది. ఈ ఆఫర్ ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ కి వర్తిస్తుంది. ఈ ఆఫర్లో దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు రూ.1499 నుంచి ప్రారంభవుతున్నాయి. ప్రీమియం ఎకానమీ రూ. 3,749 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే బిజినెస్ క్లాస్ అయితే రూ.9,999 నుంచి టికెట్ రేట్లు ప్రారంభమవుతున్నాయి.

అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.12,577 నుంచి ప్రారంభమవుతుండగా.. ప్రీమియం ఎకానమీ రూ.16,213 నుంచి ప్రారంభమవుతుంది. బిజినెస్ క్లాస్ విమాన టికెట్ ధర రూ.20,870 నుంచి మొదలవుతున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్, యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.